వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ యువతి చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆ బాధ భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ప్రేమ పేరుతో ముగ్గురు యువతులు ఓ యువకుణ్ని మోసం చేసినట్లుగా తొలుత పోలీసులు గుర్తించారు. కానీ, అసలు నిజం తెలిసి పోలీసులే షాకయ్యారు. ఒకే యువతి మూడు పేర్లతో యువకుడ్ని బుట్టలోకి దింపిందని పోలీసులు తెలుసుకున్నారు. చనిపోయిన యువకుడు మోసం చేసిన యువతి స్నేహితురాలికి సోదరుడని పోలీసులు తెలిపారు. అతని ఆత్మహత్యకు కారణాలు గుర్తించిన పోలీసులు కిలాడీ యువతిని అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలో ప్రేమ పేరుతో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని తన స్నేహితురాలైన సోదరుడికి వల వేసింది. మూడు వేర్వేరు పేర్లతో యువకుడికి ఫోన్ కాల్స్ చేసి తన మాయలోకి దింపుకుంది. ఆ యువకుడు తనకు ముగ్గురు కాల్ చేస్తున్నట్లుగా భావించాడు. చివరికి ఆమె పెట్టిన వేధింపులకు తాళలేక, ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. కుటుంబ సభ్యులు అతణ్ని ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతికి కారణమైన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. చనిపోయిన వ్యక్తి సందీప్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామం కాగా.. ఆ యువతి దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు.


Also Read: Indira Shoban Resigns: వైఎస్ షర్మిలకు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా, మళ్లీ పాత గూటికే వెళ్తారా?


మూడు పేర్లతో కన్నింగ్ ప్లాన్
సందీప్‌ ఎంఎల్‌టీ కోర్సు పూర్తిచేసి మహబూబాబాద్‌‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సోదరితో కలిసి చదువుకున్న దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన స్రవంతి అనే యువతి పరిచయమైంది. ఇద్దరు రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఆమె సందీప్‌ను ప్రేమిస్తున్నట్లు చెప్పగా.. అతనుకూడా ఒప్పుకున్నాడు. అయితే ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప ఎప్పుడూ నేరుగా కలుసుకోలేదని పోలీసులు తెలిపారు. అయితే, సందీప్ నిజంగానే తనను ప్రేమిస్తున్నాడా లేదా? అని తెలుసుకునేందుకు ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. ఆమె మరో రెండు వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్ చేసి వేర్వేరు పేర్లతో పరిచయం చేసుకుంది. కొద్దిరోజులకు ప్రపోజ్ చేసింది. అయితే, తాను స్రవంతినే ప్రేమిస్తున్నానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని అతడు నిజాయతీగా చెప్పాడు. ఈలోగా స్రవంతికి పెద్దలు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ విషయం తెలుసుకొని సందీప్ చాలా బాధపడ్డాడు.


Also Read: Hyderabad: ఇంట్లోకి చొరబడి దొంగతనం.. కానీ మంచోడట! అవాక్కైన బాధితుడు.. ఎలాగంటే..


పెళ్లయినా తన మనస్తత్వాన్ని మార్చుకోని స్రవంతి మిగతా ఇద్దరి అమ్మాయిల్లా యథాతథంగానే సందీప్‌తో ఫోన్‌లో మాట్లాడింది. స్రవంతి పెళ్లి అయిపోయింది కదా.. తనను పెళ్లి చేసుకోవాలని వేధించింది. కావ్య పేరుతో ఫోన్‌ చేసి కూడా అలాగే వేధించేది. దానికి సందీప్‌ ఒప్పుకోలేదు. ఇక తాను ఎవరినీ ప్రేమించలేనని చెప్పేవాడు. ఆరు నెలలు గడిచాక కావ్య, మనీషా పేర్లతో సందీప్‌కు మళ్లీ ఫోన్ చేసిన కిలాడీ యువతి స్రవంతి భర్తను వదిలేసిందని, కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించింది. వేరొకరిని పెళ్లి చేసుకున్న స్రవంతిని, మళ్లీ తానెలా వివాహం చేసుకుంటానని సందీప్‌ నిలదీయగా... స్రవంతి నీకోసమే భర్తను వదిలేసిందని నమ్మబలికింది. ఆ రెండు నంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు దిగుతుండడంతో కలత చెందిన సందీప్‌ ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


Also Read: Taliban in Kabul: అరాచకంగా తాలిబన్ల తీరు.. మూసేసిన భారత ఎంబసీల్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు