హైదరాబాద్‌లో నమోదైన ఓ చోరీ కేసు విస్మయం కలిగిస్తోంది. ఓ దొంగ బాధితుడితో మాట్లాడిన తీరు వెలుగులోకి రావడంతో ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి బాధితుడి అజాగ్రత్త వల్లే ఈ చోరీ జరిగినప్పటికీ దొంగ మాట్లాడిన తీరు మాత్రం తికమకగా, కాస్త నవ్వు తెప్పించేదిగా కూడా ఉంది. ఈ విషయం తెలిసిన వారు కొందరైతే అతను మంచి దొంగ అని కూడా అనేస్తున్నారు. హైదరాబాద్‌లోని పటాన్ చెరు ప్రాంతంలో ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. చివరికి బాధితుడు పోలీసులకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఈ వింత దొంగతనం విషయం బయటికొచ్చింది.


అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ శివారులోని పటాన్ చెరులో ఓ చోరీ జరిగింది. ఓ ఇంట్లో అర్ధ రాత్రి దొంగలు చొరబడి హల్‌ చల్‌ చేశారు. నిజానికి ఆ ఇంటి ఓనర్ తప్పిదం వల్లే దొంగలు పడ్డట్లు తెలుస్తోంది. పటాన్ చెరులోని శాంతి నగర్‌ కాలనీలో ఉంటున్న బాలకృష్ణ అనే వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన ఇంటి తలుపు గడియపెట్టకుండా బుధవారం రాత్రి పడుకున్నారు. వారు పడక గదిలో ఉండడంతో సులభంగా ఇద్దరు దొంగలు ఇంటి లోపలికి ప్రవేశించి ఆ ఇల్లు మొత్తం కలియ తిరిగారు. వారికి ఇంట్లో నాలుగు స్మార్ట్ ఫోన్లు తప్ప విలువైన వస్తువులేమీ కనిపించలేదు. 


Also Read: Rahul Gandhi Tour: వరంగల్‌కు రాహుల్ గాంధీ.. అదే రోజు హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తారా ఏంటి? 


Also Read: Gold-Silver Price: పసిడి నేలచూపులు.. వెండి కూడా తగ్గుదల.. మీ నగరంలో నేటి ధరలివే..


చివరికి చేసేది లేక ఆ నాలుగు ఫోన్లనే ఎత్తుకెళ్లిపోయారు. తెల్లవారి బాలకృష్ణ కుటుంబం నిద్ర లేచాక వారి ఇంట్లో స్మార్ట్ ఫోన్లు కనిపించలేదు. దీంతో రాత్రి తలుపు గడియ పెట్టని విషయం గుర్తుకు వచ్చి వారు ఇంట్లో అమర్చుకున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ రాత్రి మొత్తం వీడియో ఫుటేజీ పరిశీలించగా.. రాత్రి ఇంట్లో ఇద్దరు దొంగలు తిరిగినట్లుగా వీడియో రికార్డు అయింది. దీంతో అపహరణకు గురైన తన ఫోన్‌కు అతను ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి దొంగ ఫోన్ ఎత్తి మాట్లాడాడు. 


ఫోన్ వివరాలు అడగ్గా.. ఆ దొంగ అసలు విషయం చెప్పాడు. తామిద్దరం ఇంట్లో బంగారం కాజేయడానికి వచ్చామని చెప్పాడు. ఏ వస్తువులు దొరక్క పోవడంతో తమకు కనిపించిన స్మార్ట్ ఫోన్లు ఎత్తుకెళ్లామని చెప్పాడు. పైగా తనకు బోర్ కొడుతోందని, ఫోన్ పాస్వర్డ్ చెప్తే అందులో గేమ్స్ ఆ ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయే వరకూ గేమ్స్ ఆడుకొని మళ్లీ ఫోన్లను తిరిగి అప్పజెప్తానని హామీ ఇచ్చాడు. స్వయంగా తానే పటాన్‌చెరుకు ఫోన్లను తీసుకువచ్చి ఇస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు అవాక్కయ్యాడు. ఏం చేయాలో తెలీక ఆన్‌లైన్‌ ద్వారా హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Also Read: Gandhi Hospital Gang Rape: గాంధీ హాస్పిటల్ రేప్‌ కేసు మిస్టరీలో ట్విస్టు.. ఆ మహిళ ఆచూకీ గుర్తించారు కానీ..


Also Read: Revanth Reddy: పీసీసీ చీఫ్‌ రేవంత్‌కు టీఆర్‌ఎస్‌ నేతల సీరియస్ వార్నింగ్.. ఇలా మాట్లాడితే గజ్వేల్ సభ అడ్డుకుంటామని హెచ్చరిక