Vizag Crime: తొమ్మిది నెలలు కడుపులో మోసి కంటికి రెప్పలా కాపాడుకుంది. పుట్టిన పాప అందంగా ఉండడంతో.. ఆమెకు సినిమాలపై ఉన్న పిచ్చితో పాపను హీరోయిన్ చేయాలనుకుంది. కానీ కూతురు చిన్నగా ఉండడంతో.. ఇప్పుడు సినీ రంగంలోకి పంపించలేకపోయింది. దీంతో ఎలాగైనా సరే హీరోయిన్ ను చేయాలనుకుని పాపకు డ్రగ్ ఇంజెక్షన్లు ఇప్పిస్తోంది. ఆ తర్వాత డబ్బుల కోసం కూతురును వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ తల్లి. ఈ టార్చర్ భరించేలని ఆ బాలిక రోజూ విపరీతంగా ఏడుస్తున్నా పట్టించుకోకుండా కన్నబిడ్డతోనే వ్యాపారం చేసి కోటీశ్వరురాలు అవ్వాలనుకుంది. అయితే ఈ హృదయవిదారక ఘటన విజయనగరంలో వెలుగులోకి వచ్చింది. 


అసలేం జరిగిందంటే?


విజయనగరంలోని తోటపాలం దగ్గరలో 40 ఏళ్ల ఓ మహిళ తన కూతురితో కలిసి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమె భర్త గతంలో చనిపోయాడు. దీంతో ఆ మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడితో ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే మహిళ ప్రవర్తన నచ్చకపోవడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మొదటి భర్తతో కల్గిన 15 ఏళ్ల పాపతో ఉంటూ మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. బాలిక విశాఖలోని ప్రభుత్వ విద్యా సంస్థలో ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకుంది. వేసవి సెలవులు కావడంతో బాధిత బాలిక తన దగ్గరకు వచ్చింది. అయితే తరచుగా వారి ఇంటికి ఎవరెవరో వచ్చిపోతుండే వారు. వారిలో ఓ వ్యక్తి ఆ బాలికను చూసి.. ఆమెకు హీరోయిన్ లక్షణాలు ఉన్నాయని ఆమె తల్లితో చెప్పాడు. అయితే బాలిక చాలా చిన్నగా ఉందని.. పెద్దది అయితే సినిమాల్లోకి వెళ్లి కోట్లు సంపాధిస్తుందని వివరించాడు. 


అలాగే పాపను ఇప్పుడే సినిమాల్లోకి పంపాలంటే పెద్దగా అయ్యేలా ఇంజెక్షన్లు ఉంటాయని కూడా ఆమెకు తెలిపాడు. దీంతో ఆమె కూడా పాప త్వరగా ఎదిగితే కోట్లు సంపాధించొచ్చు, హీరోయిన్ అయిపోతుందని.. డ్రగ్ ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించాడు. అది తట్టులకోలేని బాలిక వద్దమ్మా, వద్దమ్మా అంటూ గుండెలవిసేలా రోదించింది. అయినా కూతురు బాధను పట్టించుకోకుండా ఇంజెక్షన్లు ఇస్తూనే పోయింది. ఇది చాలదన్నట్లు పెద్ద పెద్ద వాళ్ల కోరికలు తీర్చితే.. పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు ఇస్తారని చెప్పింది. మంచి భవిష్యత్తు ఉంటుందని.. కోట్లు సంపాదించొచ్చు అని ప్రలోభపెట్టేది. కానీ బాలిక మాత్రం అందుకు అస్సలే ఒప్పుకోలేదు. దీంతో కూతురు తనకు నచ్చినట్లు చేసేలా చేసుకునేందుకు చిత్రహింసలు పెట్టింది. బాలికకు పలుమార్లు నిద్రమాత్రలు కూడా ఇచ్చింది. దీంతో బాలిక ఆరోగ్యం పాడైంది. లేవలేని పరిస్థితికి చేరుకుంది. 


తనకు తెలిసిన వాళ్ల సాయంతో 1098కు కాల్ చేసింది ఆ అమ్మాయి. చైల్డ్ లైన్ సిబ్బందికి తన తల్లి పెడుతున్న చిత్రహింసలను గురించి వివరించింది. వెంటనే వారు జిల్లా అధికారులకు సమాచారాన్ని అందించారు. పోలీసుల సహకారంతో వారు అక్కడకు వెళ్లి బాలికను ఆ చెర నుంచి విడిపించి విమక్తి కల్గించారు. ప్రస్తుతం బాలికను విశాఖపట్నంలోని స్వధార్ హోమ్ లో ఉంచారు. ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేయాలని దిశ పోలీసులను కోరినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. బాలలు ఎక్కడైనా ఈ విధంగా ఇబ్బందులకు గురైన ధైర్యంగా బాలల రక్షణ కోసం పని చేస్తున్న సంస్థలను సంప్రదించాలని సూచించారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.