Case On Saipriya : పెళ్లి చేసుకున్న వాడిని కాదని ప్రేమికుడితో జీవించడం కోసం సముద్రంలో గల్లంతయినట్లుగా సీన్ క్రియేట్ చేసి జంపయిపోయిన సాయిప్రియ వ్యవహారం ముదురుతోంది. పోలీసులు ఈ అంశంలో ఏదో విధంగా సర్దుకుపోతున్నారు కానీ.. ఆమె కోసం వెదికిన నేవీ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. తమను మిస్ లీడ్ చేయడమే కాకుండా దాదాపుగా రూ. కోటి వరకూ ఖర్చు చేయించిన సాయిప్రియపై సీరియస్ అవుతున్నారు నేవీ ఉన్నతాధికారులు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
సాయిప్రియా వెదుకులాటకు రూ. కోటికిపైగా ఖర్చు
అత్యంత ఖర్చుతో కూడిన మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్‌ను రెస్క్యూకి వినియోగించామని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం దాదాపుగా రూ. కోటికి పైగా ఖర్చయిందని అంచనా. అందుకే అందరినీ తప్పు దోవ పట్టించిన సాయి ప్రియపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని.. నగర్ పోలీస్ కమిషనర్‌తో పాటు జీవీఎంసీ కమిషనర్‌కి ఫిర్యాదు చేసింది నేవీ. ఎంతో విలువైన మానవ సేవలు వృధా అయ్యాయని అవేదన వ్యక్తం చేసింది. నేవీ సూచనల మేరకు సాయిప్రియపై పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లవర్‌తో వెళ్లిపోవడానికి మిస్సింగ్ నాటకం ఆడిన సాయి ప్రియ
నాలుగు రోజుల క్రితం సాయి ప్రియ తన భర్తతో కలిసి తొలి పెళ్లి రోజును జరుపుకోవడానికి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. సముద్రంలోకి దిగిన కాసేపటికే కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడిన భరత్ తన భార్య అలల్లో కొట్టుకుపోయిందంటూ.. సపోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, అధికారులు ఆ మేరకు సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఓ యువతిని రక్షించడానికి నేవీకి సమాచారం ఇచ్చారు. హైలెవల్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ దొరకలేదు.
బెంగళూరు నుంచి తీసుకొచ్చిన పోలీసులు - ఇంట్లో వాళ్లు రానివ్వకపోవడంతో విడిగా బతకాలని జంట నిర్ణయం
తర్వాత పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా సెర్చ్చేస్తే.. భర్త కళ్లుగప్పి.. ప్రియుడు రవితో జంప్ అయ్యిందని తేలింది. బెంగళూరు వెళ్లిప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారం సీరియస్ కావడంతో బెంగళూరు నుంచి వైజాగ్ పోలీసులు తీసుకు వచ్చారు. తప్పు చేసినందకు మన్నించమని అధికారులను కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. పోలీసులు సాయిప్రియ, రవి పేరెంట్స్‌తో పాటు భర్త శ్రీనివాస్‌కు సైతం కౌన్సిలింగ్ ఇచ్చారు. తామిద్దరం కలిసి వేరుగా ఉంటామని సాయిప్రియ, రవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు వారు కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.