Extra Marital Affair: ఆమెకు పెళ్లి జరిగి సంవత్సరం పైనే అవుతుంది. అయితే వీరి కాపురం చాలా హాయిగా సాగుతోంది. భర్తకు భార్య అంటే చాలా ప్రేమ. అయితే ఓరోజు రాత్రి ఇద్దరూ కలిసి తిని పడుకున్నారు. కానీ పొద్దున లేచి చూసేసరికి ఆమె కనిపించకుండా పోయింది. ఏమైందో తెలియకు ఊరంతా వెతికాడు. ఆమె తల్లిదండ్రలకు సమాచారం ఇచ్చాడు. తన భార్యను ఎవరైనా ఏమైనా చేశారేమోనని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు. కానీ వారి దర్యాప్తులో తేలిన విషయాలతో అంతా షాకయ్యారు. ఇంత కాలం తనతో ప్రేమగా గడిపిన తన పెళ్లాం.. వేరొకరంటే ఇష్టం అని చెప్పడం  జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. 


ఏడాది క్రితం పెళ్లి.. కలహాలు లేని కాపురం!


బిహార్ లోని భోజ్ పూర్ జిల్లాకు చెందిన చింతా కుమారికి, బక్సార్ జిల్లాకు చెందిన ఓ యువకుడితో ఏడాది క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత జీవితం గురించి ఎన్నో కలలు కన్న అబ్బాయి.. తన భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. తనకేం కావాలన్నా ఇస్తూ ప్రేమగా సాకాడు. ఈ క్రమంలోనే ఓరోజు ఇద్దరూ కిలసి రాత్రి తిని పడుకున్నారు. ఉదయం అతడు లేచే సరికి ఆమె కనిపించకుండా పోయింది. తీవ్ర భయాందోళనకు గురైన అతడు ఊరంతా వెతికాడు. స్నేహితులు, బంధువులకు కూడా ఫోన్ చేసి కనుక్కున్నాడు. ఎక్కడూ ఆచూకీ లబించకపోవడంతో భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తమకు కూడా ఏం తెలియదని చెప్పే సరికి వెంటనే పోవీల్ ల్చేశన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు... యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


ప్రియుడితో కలిసి జంప్.. భార్య కోసం వెతుకుతూ భర్త తిప్పలు!


ఈ క్రమంలోనే భోజ్‌పూర్‌కు కొంత దూరంలో చింతా కుమారి.. మంజిత్ కుమార్ అనే యువకుడితో కలిసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని సదరు యువతి భర్తకు, తల్లిదండ్రులకు వివరించగా... అందరూ కలిసి ఆమె ఉన్న చోటుకు వెళ్లారు. ఏమైంది, ఎందుకు ఇక్కడున్నావని భర్త అడిగిన ప్రశ్నలు షాకింగ్ విషయాలు చెప్పింది. భర్త నోట మాట రాకుండా చేసింది. తాను, మంజిత్ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. అతడు కూడా తనను ప్రేమిస్తున్నానడని వివరించింది. అయితే తమ ప్రేమ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకుంటారో లేదో అనే భయంతో వాళ్లకు చెప్పలేదట. ఈ క్రమంలోనే అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేశారని.. భర్త విపరీతంగా చిత్ర హింసలకు గురి చేసేవాడని పేర్కొంది. దీంతో యువతి భర్త షాకయ్యాడు. ఇంత కాలం తనతో ప్రమేగా ఉన్న భార్య.. తనపై నిందలు వేయడాన్ని తట్టుకోలేకపోయాడు. 


భర్త వద్దు... ప్రియుడే ముద్దు!


అయితే పెళ్లయ్యాక మంజిత్ కుమార్ తనకు టచ్ లో లేడని.. కానీ భర్త హింసలు తట్టుకోలేక మళ్లీ మంజిత్ ను సంప్రదించినట్లు పేర్కొంది. పెళ్లైన తర్వాత కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండటం వల్లే తామిద్దరూ కలిసి పారిపోయినట్లు పోలీసుల ముందు తల్లిదండ్రులకు చెప్పింది. నేను ప్రియుడితోనే ఉంటానని వివరించింది. కాదని విడదీయాలని చూస్తే.. కలిసే చచ్చిపోతామంటూ బెదిరించింది.   ఈ క్రమంలో భర్త సహా చింతా కుమారి తల్లిదండ్రలు స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా యువతి మాటలు విని వాళ్లు షాకయ్యారు. మంజిత్ కుమార్‌ను కొన్నేళ్లుగా లవ్ చేస్తున్నట్టు చెప్పింది. అతడు కూడా తనను ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. 
తమ ప్రేమ విషయం చెబితే ఏమంటారో అని భయపడి ఇంట్లో చెప్పలేదని తెలిపింది. ఈ క్రమంలోనే తనకు పెళ్లి జరిపించారని పేర్కొంది. పెళ్లైన తర్వాత మంజిత్ కుమార్‌తో టచ్‌లో లేనని చెప్పింది. అయితే తన భర్త తనను రోజూ చిత్ర హింసలకు గురి చేయడంతో.. అతడితో కలిసి బతకలేక తిరిగి మంజిత్ కుమార్‌ను సంప్రదించినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే తామిద్దరం పారిపోయినట్టు వివరించింది. అంతేకాకుండా తాను తన ప్రియుడితోనే కలిసి బతుకుతానని స్పష్టం చేసింది. ఎవరైనా తమను విడదీయాలని చూస్తే చచ్చిపోతామని బెదిరించింది. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.