బెజవాడలోని ఓ స్పా సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. స్పా పేరుతో వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు నిర్వాహకులను, 8 మంది బాధిత మహిళలు, యువతులను, ముగ్గురు అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెజవాడ కేంద్రంగా...
ఇటీవల బెజవాడ కేంద్రంగా హైటెక్ వ్యభిచారం కొనసాగిస్తున్నారు. విజయవాడ నగరంలో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో గురునానక్ కాలనీలో ఉన్న కె స్టూడియో స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులే మారువేషంలో అమ్మాయిల కోసం వెళ్లి బేరసారాలు జరిపారు. అందులోనూ పక్కా సమాచారం అందటంతో ప్రత్యేక పోలీసు బలగాలు స్పాలో సోదాలు చేయటంతో 8 మంది అమ్మాయిలలను రక్షించారు పోలీసులు. అమ్మాయిల కోసం స్పా సెంటర్‌కు వచ్చిన ముగ్గురు యువకులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విడిపించిన మహిళలు అంతా పలు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
స్పెషల్ ప్యాకేజీలు అని అట్రాక్ట్ చేస్తున్నారు
మసాజ్ సెంటర్ లో జరుగుతున్న తంతు అంతా స్పెషల్ గా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వేరే రాష్ట్రం నుంచి అమ్మాయిలు వచ్చారని ఫొటోలు చూపిస్తూ స్పెషల్ ప్యాకేజీలు ఆఫర్ చేసి యువకులను రప్పిస్తున్నారు. దీంతో పోలీసులు పక్కాగా ఆధారాలను సేకరించిన తరువాత స్పా పై ఆకస్మిక దాడులకు వెళ్లారు. పోలీసులు సైతం ఊహించని విధంగా అక్కడ ఎనిమిది మంది అమ్మాయిలు కనిపించారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. స్పా సెంటర్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వ్యభిచారం నిర్వహించే క్రమంలో అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. స్పా కోసం వచ్చిన వారితో అమ్మాయిలు మాటలు కలపటం, వారిపై నమ్మకం కుదిరిన తరువాతనే అసలు విషయాలను బయటకు చెబుతున్నారు. అమ్మాయిలకు సైతం ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆఫర్ చేసి ఈ ఊభిలోకి లాగుతున్నారు. అవసరం అయితే ప్రత్యేక డేట్ కు ఆహ్వానించి యువకులను ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలు...
వారం వారం ప్యాకేజీ కింద డబ్బులు ఆఫర్ చేసి నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకువస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్న యువతులు, మహిళల్ని టార్గెట్ చేసి వారికి ఎక్కువ మొత్తం నగదు ఇస్తామని రప్పించి స్పా సెంటర్ పేరుతో ఇలాంటి పనులు చేయిస్తున్నారు నిర్వాహకులు. ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి నెలలపాటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన యువతుల్ని ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. మరికొందరు అమ్మాయిలు ఆర్థిక సమస్యలు ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వచ్చి ఇక్కడ చిక్కుకుపోయారని, బలవంతంగా వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఆరోపణలు సైతం వచ్చాయి. దీనిపై పోలీసులకు కొందరు సమాచారం అందించటంతో గుట్టు చప్పుడు కాకుండా దాడులు చేసి హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు చేశారు పోలీసులు.
వారే ప్రధాన టార్గెట్....
స్పా సెంటర్ అనగానే మధ్య వయసు నుంచి ఆపైన వారే ఎక్కువగా వస్తున్నారు. జాబ్ టెన్షన్, వ్యాపార లావాదేవీల్లో సమస్యలు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని మసాజ్ పేరుతో మభ్యపెట్టి అమ్మాయిలను ఎరగా వేస్తున్నారు నిర్వాహకులు. వీక్ నెస్ ఉన్నట్లు గుర్తించిన వారి వద్దకు అమ్మాయిలను పంపుతూ ఈజీగా బుట్టలో వేసుకుంటున్నారు. మానసిక ప్రశాంతత కోసం వచ్చే వారే ఎక్కువగా ఉండగా, అమ్మాయిలను పంపి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు నిర్వాహకులు. ఇలాంటి వాటిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా స్పా ముసుగులో వ్యాపారం చేయించటంతో నైట్ రౌండ్స్ కు వచ్చే పోలీసులు కూడ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు,అయినా పోలీసుల హెచ్చరికలను నిర్వాహకులు పట్టించుకోలేదు.ఇదే సమయంలో స్దానికుల నుండి పోలీసులకు పక్కాగా సమాచారం అందటంతో వ్యభిచారం నిర్వాహిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
బెజవాడ స్పా సెంటర్ గుట్టురట్టు, పక్క రాష్ట్రాల అమ్మాయిలకు స్పెషల్ ప్యాకేజీలు ఆఫర్ చేసి మరీ !
Harish
Updated at:
12 Dec 2022 09:06 PM (IST)
విజయవాడ నగరంలో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో గురునానక్ కాలనీలో ఉన్న కె స్టూడియో స్పాలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. కొందరు మహిళల్ని విడిపించారు.
ప్రతీకాత్మక చిత్రం ( Getty Image)
NEXT
PREV
Published at:
12 Dec 2022 09:06 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -