UP Fake Office:
ఫేక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్..
యూపీలో ఫేక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌నే సృష్టించారు కొందరు కేటుగాళ్లు. దాదాపు 176 మందితో ఆఫీస్‌ని ఓపెన్ చేశారు. ఉద్యోగాలు ఇస్తామంటూ మభ్యపెట్టి చివరకు పోలీసులకు చిక్కారు. విభూతి ఖండ్ ఏరియాలోని పూర్వాంచల్ అపార్ట్‌మెంట్‌లో ప్రదీప్ మిశ్రా అనే ఓ నిందితుడిని అరెస్ట్ చేసి ఈ రాకెట్‌ని పసిగట్టారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఈ కేసుకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఫేక్ ఆర్గనైజేషన్‌ని సృష్టించారని వెల్లడించారు.
" నిందితుడు ప్రదీప్ మిశ్రాని అరెస్ట్ చేసి విచారించాం. అప్పుడే అసలు విషయం బయటపడింది. అతనితో పాటు మరి కొందరు కలిసి ఓ ఫేక్ సంస్థని నడుపుతున్నారు. మానవ్ వికాస్ స్వాస్థ్య సేవ్ సంస్థాన్ సంస్థ ఆఫీస్‌ని సృష్టించారు. అంతే కాదు. ఫేక్ వెబ్‌సైట్ కూడా క్రియేట్ చేశారు. IndianHealth.inకి ఫేక్ సైట్ పెట్టారు. తమ ఆఫీస్..హెల్త్ డిపార్ట్‌మెంట్ యూనిట్ అని మభ్యపెట్టారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ మేనేజర్, బ్లాక్ హెల్త్ ఆఫీసర్స్ ఉద్యోగాలున్నాయని పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేశారు. కచ్చితంగా అపాయింట్‌మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేశారు"
- పోలీసులు
అభ్యర్థులకు అనుమానం రాకుండా మేనేజ్ చేశారు. ఫేక్, ఫోర్జ్‌డ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. మరో ట్విస్ట్ ఏంటంటే...లఖ్‌నవూతోపాటు మరి కొన్ని జిల్లాల్లో రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తరవాత ఉన్నట్టుండి డబ్బులతో పరారయ్యారు. ఒక్కో పోస్ట్‌ని బట్టి రూ.2-10లక్షల వరకూ కలెక్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఐడీ కార్డులు ఇచ్చి మరీ బురిడీ కొట్టించారు.