UP Crime News: ఓ వ్యక్తికి తన భార్యతో స్నేహం ఉంది. అయితే అది వివాహేతర సంబంధమేమోనని భావించిన భర్త.. అతడిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యకు చెప్పి అతడికి ఫోన్ చేయించి మరీ ఇంటికి రప్పించాడు. ఆపై ఫుల్లుగా మద్యం తాగించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని 15 ముక్కలుగా చేసి మూడు సంచుల్లో వేసి మూట కట్టాడు. ఓ సంచిని తీసుకెళ్లి బయట పడేశాడు. మిగిలినవి కూడా పడేసే లోపే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి మృతదేహాన్ని గుర్తించారు. ఆపై పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


అసలేం జరిగిందంటే..?


ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో మిలాల్ ప్రజాపతి అనే వ్యక్తి రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా నివసిస్తున్న రాజస్థాన్ లోని కోట్ పుట్లీకి చెందిన అక్షయ్ కుమార్, తన భార్య మధ్య వివాహేతర సంబంధం ఉందని అతను అవమానించాడు. ఈ క్రమంలోనే అతడిపై పగ పెంచుకున్నాడు. ఆ విషయం భార్యకు చెప్పకుండానే.. గురువారం రోజు అతడిని ఇంటికి రమ్మని పిలవాలని భార్యతో చెప్పాడు. ఆమె ఫోన్ చేసి చెప్పడంతో అతడు ఇంటికి వచ్చాడు. అయితే కుమార్తెకు కాలిన గాయాలు కావడంతో చికిత్స కోసం ప్రజాపతి భార్య ఢిల్లీలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే ఇంటికి వచ్చిన అక్షయ్ కుమార్ ప్రజాపతి మద్యం తాగించాడు. 


ఆ తర్వాత రాత్రి వేళ గొడ్డలితో దాడి చేసి అతడిని హత్య చేశాడు. అక్షయ్ మృతదేహాన్ని  15 ముక్కలుగా చేశాడు. వాటిని మూడు బ్యాగుల్లో ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటకు తన రిక్షాలో తీసుకెళ్లి ఖోడా కాలనీ ప్రాంతంలో పడేశాడు. మరోవైపు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్షయ్ మృతదేహాం ముక్కలు ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. నిందితుడు ప్రజాపతిని గురించి అతడిని అరెస్ట్ చేశారు. అక్షయ్ కుమార్ హత్యలో నిందితుడి భార్య పాత్ర ఉందా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 


గొడవల కారణంగా మూడో భార్యపై దాడి


కుటుంబ కలహాలతో భార్యపై కొడవలితో దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఫిరంగడ్డ ప్రాంతానికి చెందిన రామచంద్రుకి ముగ్గురు భార్యలు. చిన్న భార్య ఎల్లమ్మతో కొంతకాలంగా గొడవలు జరుగుతుంది. శనివారం తెల్లవారు జామున గొడవ జరగడంతో భార్య ఎల్లమ్మపై కొడవలితో దాడి చేశాడు రామచంద్రు. రక్తపు మడుగులో పడిఉన్న తల్లిని చూసిన కూతురు అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి బాధితురాలిని ఎంజీఎం హాస్పటల్ తరలించారు. 










మద్యం మత్తులో తలెత్తిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన చెవ్వల్ల రాజు అనే వ్యక్తి శుక్రవారం ఊళ్లోని ఓ మద్యం షాపునకు వెళ్లి మద్యం సేవిస్తుండగా సాంబరాజు అనే వ్యక్తితో గొడవ తలెత్తింది. ఈ క్రమంలో సాంబరాజు అనే వ్యక్తి రాజుపై దాడి చేయగా తలకు బలమైన గాయలు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. రాజు మృతికి కారణమైన సాంబరాజు ఇంటి ఎదుట రాజు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాజుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు.