Severe Road Accident In Khammam District: అతి వేగం ముగ్గురి నిండు ప్రాణాలు బలిగొంది. ఖమ్మం జిల్లా (Khammam District) సత్తుపల్లి మండలంలో ఈ ఘోర ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుంది. బి.గంగారం గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు వారి తలలు పగిలి మెదళ్లు బయటకు వచ్చాయి. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు బేతి సురేష్ (22), ముద్దిన వేణు (19), కరీముల్లా (11)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.