UGC NET June 2024 Exam Schedule: దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న యూజీసీ నెట్ (జూన్)-2024 పరీక్ష తేదీలను సబ్జెక్టుల వారీగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 4 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30 తేదీల్లో; సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో రెండు సెషన్లలో నెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 83 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఫోన్ నెంబరు: 011 - 40759000 /011 - 69227700 లేదా ఈమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.


UGC NET సబ్జెక్టులు: అడల్ట్ ఎడ్యుకేషన్/కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్/ఆండ్రాగోజీ/నాన్-ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, అరబ్ కల్చర్ & ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ-జైన-గాంధీయన్ & పీస్ స్టడీస్, చైనీస్, కామర్స్, కంపేరిటివ్ లిటరేచర్, కంపేరిటివ్ స్టడీ ఆఫ్ రిలీజియన్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, క్రిమినాలజీ, డిఫెన్స్ & స్ట్రాటజిక్ స్టడీస్,  డోగ్రి, ఎకనామిక్స్/రూరల్ ఎకనామిక్స్/కో-ఆపరేషన్/డెమోగ్రఫీ/డెవలప్‌మెంట్ ప్లానింగ్/డెవలప్‌మెంట్ స్టడీస్/ఎకనామెట్రిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/డెవలప్‌మెంట్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, జానపద సాహిత్యం, ఫోరెన్సిక్ సైన్స్, ఫ్రెంచ్ (ఫ్రెంచ్ వెర్షన్), భౌగోళిక శాస్త్రం, జర్మన్, గుజరాతీ, హిందీ,  హిందూ స్టడీస్, హిస్టరీ, హోమ్ సైన్స్, మానవ హక్కులు & విధులు, భారతీయ సంస్కృతి, జపనీస్, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, లేబర్ వెల్ఫేర్/పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/ HRM, లా, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మైథిలి, మలయాళం, మేనేజ్‌మెంట్ (బిజినెస్ అడ్మిన్./మార్కెటింగ్/మార్కెటింగ్ Mgt./ఇండస్ట్రియల్ రిలేషన్స్ & పర్సనల్ Mgt./ పర్సనల్ Mgt./ఫైనాన్షియల్ Mgt./కో-ఆపరేటివ్ మేనేజ్‌మెంట్‌), మణిపురి, మరాఠీ, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం


మ్యూజియాలజీ & కన్జర్వేషన్, మ్యూజిక్, నేపాలీ, ఒరియా, పాలి, పెర్ఫార్మింగ్ ఆర్ట్ - డ్యాన్స్/డ్రామా/థియేటర్, పర్షియన్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్ (ఇంటర్నేషనల్ రిలేషన్స్/ఇంటర్నేషనల్ స్టడీస్‌తోపాటు డిఫెన్స్/స్ట్రాటజిక్ స్టడీస్, వెస్ట్ ఏషియన్ స్టడీస్, సౌత్ ఈస్ట్ ఆసియన్ స్టడీస్, ఆఫ్రికన్ స్టడీస్, సౌత్ ఆసియన్ స్టడీస్, సోవియట్ స్టడీస్, అమెరికన్ స్టడీస్), పాపులేషన్ స్టడీస్, ప్రాకృతం, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పంజాబీ, రాజస్థానీ, రష్యన్, సంస్కృతం, సంస్కృత సాంప్రదాయ సబ్జెక్ట్‌లు (జ్యోతిష/సిద్ధాంత జ్యోతిషం/నవ్య వ్యాకర్ణ/వ్యాకర్ణ/మీమాంస/నవ్య న్యాయ/సాంఖ్య యోగం/తులనాత్మక దర్శన్/శుక్ల యజుర్వేదం/మాధవ్ వేదాంతం/ధర్మశాస్తా/సాహిత్య/ఆగమతో సహా), సంతాలి, సింధీ, సోషల్ మెడిసిన్ & కమ్యూనిటీ హెల్త్, సోషల్ వర్క్, సోషియాలజీ, స్పానిష్, తమిళం, తెలుగు, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్, ట్రైబల్ & రీజినల్ లాంగ్వేజ్/లిటరేచర్,ఉర్దూ, విజువల్ ఆర్ట్ (డ్రాయింగ్ & పెయింటింగ్/స్కల్ప్చర్ గ్రాఫిక్స్/అప్లైడ్ ఆర్ట్/హిస్టరీ ఆఫ్ ఆర్ట్), ఉమెన్ స్టడీస్, యోగా.


పరీక్ష విధానం..


➥ ఆఫ్‌లైన్ (OMR Based) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.


➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.


➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 


ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


Notification


Website



సబ్జెక్టులవారీగా పరీక్షల షెడ్యూలు ఇలా..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..