Crime News :  నిజామాబాద్ జిల్లా బోధన్ లో  శ్రీకాంత్ అనే యువకుడి మృతి వివాదం రేపుతోంది. మూడు నెలల కిందట అదృశ్యమైన బోధన్ కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు శవమై కనిపించాడు. ప్రేమ వ్యవహారమే యువకుడు శ్రీకాంత్ ప్రాణాల్ని తీసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. యువతి బంధువులు ప్రియుడు శ్రీకాంత్ ను బెదిరించినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో 3 నెలల కిందట యువకుడు శ్రీకాంత్ అదృశ్యమయ్యాడు. ఎక్కడ వెతికినా శ్రీకాంత్ జాడ మాత్రం దొరకలేదు. చివరికి చెరువు గట్టున అస్తిపంజరంగా కనిపించారు. 


అక్టోబర్ 10వ తేదీ వరకూ ప్రేమికురాలితో చాటింగ్ 


సెప్టెంబర్ 22 న శ్రీకాంత్ అతని ప్రియురాలితో చాటింగ్ చేశారు.  అలాగే అక్టోబర్ 10 వరకు కూడా వీరిద్దరూ చాటింగ్ లో ఉన్నట్లు సెల్ ఫోన్ ఆధారాలు ఉన్నాయి. అంటే అప్పటి వరకు శ్రీకాంత్ ఎక్కడ ఉన్నాడు...? 23వ తేదీ నుంచి చనిపోయినట్లు ట్రెస్ అయిన తేదీ వరకు ఎక్కడ ఉన్నాడు... సెప్టెంబర్ 21న కొందరు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి కొందరు చంపేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్ చదువుకునే కాలేజీకి సైతం వెళ్లి అతన్ని కూడా బెదిరించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్టోబర్ 10 వరకు ప్రేమికురాలితో శ్రీకాంత్ చాటింగ్ చేశారు.  ఆ తర్వాత ఏం జరిగిందన్నది ట్విస్ట్..!


సెప్టెంబర్ 24నే పోలీసులకు ఫిర్యాదు 


సెప్టెంబర్ 24 న పోలీసు స్టేషన్ లో శ్రీకాంత్ మిస్సయ్యాడంటూ అతని బంధువులు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 10 వరకు చాటింగ్ ప్రకారం చూస్తే శ్రీకాంత్ బతికి ఉన్నాడని అర్థం. మరి సెప్టెంబర్ 24 న శ్రీకాంత్ బంధువులు ఫిర్యాదు చేసినపుడు పోలీసులు ఏం చేశారు అన్న ప్రశ్న వస్తోంది. శ్రీకాంత్ తో అతని ప్రియురాలు చేసిన చేసిన చాటింగ్ లో ఇంట్లో మన విషయం తెలిసింది. అమ్మ చూసింది. మన పెళ్లికి ఒప్పుకున్నారంటూ చాటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటాడా.... ఒక వేళ వెళ్తే అమ్మాయి బంధువులు అతన్ని ఏమైనా చేశారా ఇలాంటి అనుమానాలు మృతుడి బంధువుల్లో వ్యక్తం కావటం కామన్. మృతుడు శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకునే అవకాశాలు లేవనేది కూడా చెప్పవచ్చు. శ్రీకాంత్ మృతి చెందిన ప్రాంతంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే ఈ మిస్టరీకి తెర పడే అవకాశం ఉంది. 


అత్మహత్య చేసుకున్నట్లుగా లేని పరిసరాలు ! 


మరోవైపు శ్రీకాంత్ నిజంగా ఆత్మహత్యే చేసుకున్నాడని అనుకున్నా ఆ ప్రాంతంలో భిన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసుపువాగు గట్టున ఉన్న చింతచెట్టు వేరుకు బెల్టు వేలాడుతుండటం, అస్తిపంజరంగా మారి శరీర భాగాలు విడిపోయి ఉండటం. పది అడుగుల ఎత్తులో చెట్టు వేరు వద్దకు వెళ్లి ఉరివేసుకునే అవకాశం ఏమాత్రం లేదు. బెల్టును ఒక వైపు చెట్టు కొమ్మకు మరో వైపు మెడకు చుట్టుకునే వీలుండదు.  కుళ్లిపోయిన శవం దుర్వాసన సమీప రైతులు, గీత కార్మికులు గుర్తించకపోవడం.  సెప్టెంబరులో వాగు ప్రవాహాన్ని తట్టుకొని చెప్పులు అలాగే ఉండటం. పుస్తకాలు చెల్లాచెదురుగా పడి ఉండటం, వాటికి మట్టి మరకలు కూడా లేకపోవడం ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యుల్లోనూ.... ఇదే ఆందోళన నెలకొంది.