Temple sevadaar beaten to death over a few minutes wait for prasad:  ఢిల్లీలోని  ప్రసిద్ధ కాలకాజీ మందిరంలో శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో పని చేసే చేసే 35 ఏళ్ల  యోగేందర్ సింగ్‌ను కొందరు  ‘  ప్రసాదం’ కోసం జరిగిన వివాదంలో కొట్టి చంపారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.  ఇందులో దాదాపు 5-6 మంది వ్యక్తులు సేవాదార్‌పై కర్రలతో దాడి చేస్తున్న దృశ్యాలున్నాయి. 

Continues below advertisement


ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌కు చెందిన యోగేందర్ సింగ్ (35) గత 14-15 సంవత్సరాలుగా కాలకాజీ మందిరంలో సేవాదార్‌గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 29, 2025 రాత్రి 9:30 గంటల సమయంలో, కొందరు భక్తులు దర్శనం తర్వాత ‘ప్రసాదం’ పెట్టాలని యోగేందర్ సింగ్‌ను కోరారు. కొన్ని నిమిషాలు వేచి ఉండమని అతను సూచించడంతో వివాదం మొదలైంది. ఈ వివాదం హింసాత్మకంగా మారింది. సుమారు 10-15 మంది వ్యక్తులు ఇనుప రాడ్లు, కర్రలతో యోగేందర్‌పై దాడి చేశారు. 


దాడి చేసిన వారు పారిపోయారు. ఆలయానికి చెందిన వారు  యోగేందర్ సింగ్‌ను  ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూ  మరణించాడు. స్థానికులు ఒక దాడి చేసిన వ్యక్తని అతుల్ పాండేగా గుర్తించి .. పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  మిగిలిన నిందితులను గుర్తించేందుకు, అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు ప్రకటించారు.  



సీసీటీవీ ఫుటేజ్‌లో దాడి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మందిరం చుట్టూ అదనపు పోలీసు బలగాలను మోహరించి, శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చట్టం, శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ , మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఈ ఘటనను బీజేపీ నిర్వహణలోని చట్టం,  శాంతిభద్రతల వైఫల్యంగా విమర్శించారు.


యోగేందర్ సింగ్ దాదాపు దశాబ్దన్నర కాలం పాటు మందిరంలో నిస్వార్థంగా సేవలు అందించిన వ్యక్తిగా సహ సేవాదార్‌లు అభివర్ణించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.