Chandrababu Naidu conducted Krishna Jala Aarti in Kuppam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువు వద్ద కృష్ణా నది జలాలకు జలహారతి అర్పించారు. హంద్రీ-నీవా కాలువ విస్తరణ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు చిత్తూరు, కుప్పం, పలమనేరు మొదలైన ప్రాంతాలు కృష్ణా నది నీరు చేరుకోవడానికి చేపట్టిన భారీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ హయాంలో గేట్లతో సెట్టింగ్ లు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి నాటకాలు ఆడిన ఘటనలు చూశాం..విమానం ఎక్కేలోపు నీళ్లన్నీ ఇంకిపోయిన పరిస్థితులను చూశాం. అసెంబ్లీలో చెప్పినట్లుగానే ఎవరు అడ్డుకున్నా.. హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకొస్తామని చెప్పాం.. చేసి చూపిస్తున్నామని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. రాయలసీమలో కరవు వస్తే పశువుల కోసం రైలులో నీళ్లు తెప్పించి కాపాడుకున్నాం..అలాంటి పరిస్థితి రావొద్దని హంద్రీనీవాకు శ్రీకారం చుట్టాను. నేను ఏ పని చేయలన్నా వెంకన్నపై భారం వేసి .. బుల్లెట్ మాదిరి దూసుకువెళ్తా.. వెనుదిరిగి చూడటం తనకు తెలియదని చంద్రబాబు అన్నారు.
" సాగు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది" అని చంద్రబాబు అన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా సీమ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ 738 కి.మీ. ప్రయాణించి కుప్పానికి చేరడం గొప్ప విజయమని అన్నారు. ఇది రికార్డు స్థాయి పఅన్నారు. గతంలో ఎన్‌టీఆర్ రాయలసీమను ఆకుపచ్చగా మార్చాలని కలలు కన్నారు. ఆ కలను తాను సాకారం చేస్తున్నానని, సీమ పల్లెల్లోకి నీళ్లు పారించడం ద్వారా పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అందుతున్నాయని ప్రసంగించారు. ఇది రాష్ట్ర ప్రగతికి మైలురాయి అని చెప్పారు.పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టు వద్దకు వచ్చేటప్పుడు మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సులో ప్రయాణించారు. బస్సులోని వారితో ఫోటోలు దిగారు.
పూజలు చేసిన తర్వాత పరమ సముద్రం చెరువులో బోటు ద్వారా తిరిగారు. ఆ చెరువులో నళ్లు దశాబ్దాలుగా నిలబడలేదు. ఇప్పుడు దాదాపుగా చెరువు నిండుగా నీరు ఉండటంతో ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేశారు.