Vishal About His Wedding Details: కోలీవుడ్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సికల నిశ్చితార్థం తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో ఆయన పుట్టినరోజున వీరి ఎంగేజ్మెంట్ వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పెళ్లి తేదీ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 

ఆ భవనం... ఓ సంకల్పం

నిజానికి వీరి వివాహం ఆగస్ట్ 29నే జరగాల్సి ఉంది. హీరోయిన్‌ను పెళ్లి చేసుకోనున్నారని గతంలోనే పలు రూమర్స్ రాగా... 'యోగీ దా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 'నడిగర్ సంఘం' భవన నిర్మాణం తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. గతంలోనే ఈ విషయాన్ని పలుమార్లు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. దీనికి ధన్సిక కూడా అంగీకారం తెలిపినట్లు చెప్పారు.

మ్యారేజ్ డేట్ ఎప్పుడంటే?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశాల్... బ్యాచిలర్‌గా ఇదే తన చివరి పుట్టిన రోజని... 'నడిగర్ సంఘం' భవన నిర్మాణం పూర్తైన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 'నా కండిషన్‌కు ధన్సిక కూడా ఓకే చెప్పింది. దీని కోసం 9 ఏళ్లుగా ఎదురుచూశాం. మరో 2 నెలల్లో అది పూర్తవుతుంది. మా పెళ్లి ఆ భవనంలోనే జరుగుతుంది. అందులో జరిగే ఫస్ట్ పెళ్లి మాదే. ఇందుకోసం ఇప్పటికే ఓ ఆడిటోరియం కూడా బుక్ చేసుకున్నాం. భవనం ప్రారంభమైన వెంటనే మా మ్యారేజ్ డేట్ నిర్ణయిస్తాం.' అంటూ క్లారిటీ ఇచ్చారు.

Also Read: అల్లు అర్జున్ అట్లీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ - స్టార్ కమెడియన్ ఎంట్రీ?... స్పెషల్ సర్‌ప్రైజెస్ చాలా ఉన్నాయ్

2001లో ఇండస్ట్రీకి వచ్చిన విశాల్... తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ మూవీస్ తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రేమ చదరంగం, పందెం కోడి, పందెం కోడి 2, భరణి, అభిమన్యుడు, డిటెక్టివ్ మూవీస్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా 'మద గజరాజా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం తుప్పరివాలన్ 2, మకుటం మూవీస్‌లో నటిస్తున్నారు. ఇటీవలే టైటిల్ అనౌన్స్ చేయగా... ఆయన కెరీర్‌లో ఇది 35వ సినిమా. రవి అరసు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో దుషారా విజయన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక సాయి ధన్సిక... 2006లో ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలుపెట్టారు. కోలీవుడ్‌తో కన్నడలోనూ పలు మూవీస్ చేసి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. రజినీకాంత్ 'కబాలి'లో కీలక రోల్ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతిమ తీర్పు, షికారు, దక్షిణ మూవీస్‌లో నటించారు. 'యోగీ దా' మూవీ చేస్తున్న టైంలోనే విశాల్, ధన్సికల మధ్య ప్రేమ చిగురించగా తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

అటు... నడిగర్ సంఘం భవన నిర్మాణం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. 2017లో భవన నిర్మాణం చేపట్టినప్పటి నుంచి పలు కారణాలతో ఆలస్యం కాగా... దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చింది. మరో 2 నెలల్లో ప్రారంభం కానుంది.