Seven Members Arrested Who Malpractices in Duoling Exam: అంతర్జాతీయ వర్శిటీల్లో ప్రవేశ అర్హత కోసం నిర్వహించే డ్యూలింగ్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతోన్న ఏడుగురిని ఎల్బీ నగర్ (LB Nagar) ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్ నగర్ (Hayath Nagar) లోని వెంకటేశ్వర లాడ్జిలో ఓ గది అద్దెకు తీసుకుని వీరంతా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని వివిధ విశ్వ విద్యాలయాల్లో చేరాలనుకునే వారి కోసం ఈ డ్యూలింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవీణ్ రెడ్డి, అరవింద్ రెడ్డి, హరినాథ్, కృష్ణ, సంతోష్, నవీన్ కుమార్, వినయ్ అనే వ్యక్తులు ఆన్ లైన్ లో ఒకరికి బదులుగా పరీక్ష రాస్తుండగా.. వీరిని గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు హోటల్ పై దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పరీక్ష రాసేందుకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరి నుంచి 5 ల్యాప్ టాప్స్, 4 పాస్ పోర్టులు, 7 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను హయత్ నగర్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.


Also Read: Hyderabad Traffic Police : మీది మొత్తం వెయ్యి అయింది యూజర్ చార్జెస్ ఎక్స్‌ ట్రా - ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందా ?