Hyderabad Traffic Police challan : ‘మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అనే డైలాగ్ తో ఐటీ కారిడార్ లో ఫుడ్ స్టాల్ కమారి ఆంటీ పాపులర్ అయింది. సోషల్ మీడియా సెన్సెషన్ గా నిలిచింది. ఇప్పుడీ డైలాగ్ ను సమయస్ఫూర్తిగా వాడుకున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ సిటీ పోలీస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఓ ఫ్లైఓవర్ పై ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు. అంతే కాదు ఫోన్ కూడా మాట్లాడడుతున్నాయి. ఈ వ్యక్తి ఫోటోను ట్వీట్ చేసిన సిటీ పోలీసులు మీది మొత్తం వెయ్యి అయింది.. యూజర్ చార్జెస్ ఎక్స్ ట్రా అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ బండి నెంబర్ ను మాత్రం.. కనిపించకుండా చేశారు. వ్యక్తిగతంగా ఆయన బండి నెంబర్ పేరున చలానా క్రియేట్ అయింది. ఆ వ్యక్తికి చేరింది. కానీ దీన్ని క్రియేటివ్ గా పోస్ట్.. చేసి వైరల్ అయ్యేలా చేశారు పోలీసులు.
అయితే ఈ ట్వీట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ ట్రాఫిక్ పోలీసులది కాదు.. హైదరాబాద్ సిటీ పోలీసులది. వెంటనే చాలా మంది.. ట్రాఫిక్ ఉల్లంఘిస్తన్న వాహనాల ఫోటోలు తీసి ఈ ట్వీట్ కు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఆ ట్వీట్లకు హైదరాబాద్ సిటీ పోలీసులు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు రిఫర్ చేశారు. రాంగ్ రూట్ లో వస్తున్నఓ ట్యాంకర్ ఫోటోను నెటిజన్ ట్వీట్ చేశారు.
కొంత మంది నిరంతరాయంగా ఉంటున్న సమస్యసలనూ ప్రస్తవించారు.
ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేసి ఉంటే.. అలాంటి ఉల్లంఘనలు చాలా ఉన్నాయని ట్వీట్ చేసి ఉండేవారు నగరవాసులు. ఇలా ఎవరు ఫోటోలు పంపినా ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి ఫైన్లు వేసి.. చలాన్లు ఇంటికి పంపుతారు పోలీసులు.