Oorvasivo Rakshasivo Today Episode : దుర్గ ఆకతాయిలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. అది చూసిన రక్షిత వాళ్ల పేరు పెట్టి మమల్ని కూడా అనేస్తుంది అనుకుంటుంది. ఇక వాళ్లు దుర్గకు సారీ చెప్తారు. ఇంతలో దయాసాగర్ వచ్చి దుర్గ సమయానికి విజయేంద్ర రాకపోతే ఏమై ఉండేదో ఒకసారి ఆలోచించు అంటాడు. 


దుర్గ: మనం సైలెంట్‌గా ఉంటే మన చుట్టు పక్కల ఉండేవారు ఇలాగే రెచ్చిపోతారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వారిని నడిరోడ్డు మీద వాళ్ల ఇంట్లో వాళ్లముందే ఉరి తీయాలి.
రక్షిత: పురు పద వెళ్దాం. ఇంటి దగ్గర.. ధీరు ఏమైంది నీకు నాకు చెప్పకుండా నా పర్మిషన్ తీసుకోకుండా ఒక్క పని చేసేవాడివి కాదు. కానీ ఇప్పుడు నువ్వు పూర్తిగా మారిపోయావ్. ఏం చేసినా చెప్పడం లేదు. అడిగినా అబద్ధం చెప్తున్నావ్. ఎంత చెప్పినా వినకుండా మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నావ్. నువ్వు దుర్గని మీట్ అవ్వకు. తన వల్లే నీకు ఇబ్బందులు వస్తాయి అని చెప్తున్నా వినడం లేదు. తనకు దూరంగా ఉండమని చెప్తున్నా వినకుండా తనతో చాలా దూరం వెళ్లిపోయావ్. నాకు చెప్పకుండా మీ నాన్నతో వాళ్ల నాన్నతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడించావ్ అంటే ఏమనాలి.
ధీరు: మామ్ జరిగిన వాటికి సారీ..
రక్షిత: సారీ అంట. 
ధీరు: నేను నిన్ను దూరం పెట్టాలనో.. ఇంకో కారణం వల్లో డాడీతో అడిగించ లేదు. ఎందుకో తెలీదు రోజు రోజుకు దుర్గ అంటే నాకు ఇష్టం పెరిగిపోతుంది. తను నాకు సొంతం కావాలి అనిపిస్తుంది. నా లైఫ్‌ని తనతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది.
రక్షిత: స్టాపిట్.. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది పురు. వీడు పూర్తిగా దుర్గ ట్రాప్‌లో పడిపోయాడు. 
పురుషోత్తం: రక్షిత కూల్ ధీరు దుర్గని ఇష్టపడుతున్నాడు. మనం ఎన్ని చెప్పినా వాడి బుర్రకు ఎక్కదు. రెండు రోజులు ఆగితే నీ బాధ వాడికి అర్థమవుతుంది. 
రక్షిత: అప్పటి వరకు ధీరు లైఫ్‌ని నేను రిస్క్‌లో పెట్టలేను. నేను ఒకరితో మాట్లాడేటప్పుడు ఎదుటి వారి మనసులో ఏముందో తెలుసుకుంటాను. వారి కళ్లలో చూస్తాను. దుర్గ పైకి ఒకలా మాట్లాడినా తన మనసులో చాలా ఉంటాయి. కళ్లలో పైకి ఎదో సాధించబోతున్నా అనే కాన్ఫిడెంన్స్‌ ఉంటుంది. టోటల్‌గా దుర్గ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అప్పటి వరకు నువ్వు తనకి దూరంగా ఉండు. పురు నువ్వు కూడా ధీరు చెప్పాడు అని బాధ పడతాడు అని నాకు చెప్పకుండా ఆ దుర్గ విషయంలో ఏ నిర్ణయం తీసుకోకు. ఇక దుర్గ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పమని వాసుకు ఫోన్ చేసి చెప్తుంది. అసలు కొంచెం కూడా సమాచారం ఇవ్వను అని వాసు అనుకుంటాడు. 


మరోవైపు దుర్గ విజయేంద్ర గురించి ఆలోచిస్తుంది. ఇక దయాసాగర్ దుర్గ దగ్గరకు వచ్చి విజయేంద్ర గురించి తప్పుగా ఆలోచిస్తున్నావ్ అని అనిపిస్తుంది అంటాడు. తనకు విజయేంద్ర మీద నమ్మకం లేదు అని దుర్గ అంటుంది. కానీ తనని ప్రేమించాను అని తన మీద ప్రేమ ఉంది అని దాని కంటే కోపం కూడా ఉందని దుర్గ చెప్తుంది. అయితే తనకు తన పగ మాత్రమే చాలు అని అంటుంది. దీంతో దయాసాగర్ నీకు విజయేంద్ర హెల్ప్ ఉంటే నీ పగ తొందరగా  తీరుతుంది అంటాడు. దానికి దుర్గ నాకు మీ సాయం ఉంటే చాలా నాన్న అంటుంది.   


రక్షిత రౌడీకి దుర్గ ఫొటో పంపించి కాలు చేయి పోయి జీవితాతం అవిటి దానిలా ఉండాలి అని అంటుంది. మరోవైపు దుర్గకు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. పాత ఇంటి టాక్స్ కట్టాలి అని చెప్తారు. దుర్గ సరే అని వస్తాను అని అంటుంది. ఇక అప్పుడే ధీరు దుర్గ దగ్గరకు వస్తాడు. పెళ్లి గురించి మాట్లాడుతాడు. 


ధీరు: ఏంటి దుర్గా నువ్వు నా నుంచి ప్రేమ పెళ్లి అనే టాపిక్ వచ్చినప్పుడు నువ్వు సీరియస్ అయిపోతావ్. నువ్వు ఇలాగే ఉంటావ్ మా అమ్మ అలాగే ఉంటుంది. 
దుర్గ: నాతో పెళ్లి గురించి మా డాడ్‌తో మాట్లాడారు అని మీ అమ్మకి తెలుసా.. 
ధీరు: తెలుసు..
దుర్గ: ఏమన్నారు.
ధీరు: తనకు నీ మీద పాజిటివ్ ఇంప్రెసన్ లేదు నిన్ను కలవొద్దు అంటుంది. నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటావో తనకి తెలీక అలా అంటుంది అని నాకు అనిపిస్తుంది. కానీ నువ్వు నాకు ఎంత ఇష్టమో మా అమ్మకు చెప్తేస్తా. నువ్వు ఓకే అంటే నేను ఎలా అయినా మా అమ్మని ఒప్పిస్తాను.
దుర్గ: నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమకు చాలా థ్యాంక్స్ ధీరు. కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి పూర్తి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను. 
ధీరు: తనలో తాను ఏదీ ఏమైనా నిన్ను మాత్రం వదలను దుర్గ..


రక్షిత: పురు ఆ విజయేంద్ర బయట ఉంటే ధీరుకే ప్రమాదం ఇక్కడే ఉంటే వాడి ఎత్తులకు పై ఎత్తు మనం వేయొచ్చు. కాకపోతే ధీరు విజయేంద్రతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పాలి. 
పురుషోత్తం: అవును విజయేంద్ర చాలా తెలివైనవాడు. ఇంతలో విజయేంద్ర వాళ్లు ఇంటికి వస్తారు. ధీరు కూడా అప్పుడే వస్తాడు. రక్షిత ప్రశ్నిస్తే పురు వద్దు అంటాడు. ఇక విజయేంద్ర వైష్ణవి వాళ్ల ఇంటికి వెళ్తాను అని తన ఫ్రెండ్‌తో మాట్లాడుతాడు. దాన్ని రక్షిత చూస్తుంది. విజయేంద్రను ఇంటి లోపలికి పిలిస్తే అర్జెంట్‌ పని అని బయల్దేరుతాడు. జయ వచ్చి వైష్ణవి మీద వీడికి రోజు రోజు ప్రేమ పెరిగిపోతుంది అని వైష్ణవి లేదు అని తెలిస్తే వీడు ఏమైపోతాడో అంటుంది. మరోవైపు దుర్గ పాత ఇంటి దగ్గరకు వచ్చి టాక్స్ కడుతుంది. తర్వాత ఆ ఇంటికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.  


Also Read:  కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 20th: శోభనం ఏర్పాట్లు చేసి షాక్ ఇచ్చిన కృష్ణ.. ఆదర్శ్‌కి నిజం చెప్పేసిన ముకుంద!