Electric Bike Sets On Fire In Tamil Nadu: బ్యాటరీ వెహికల్ పేలడంతో విషాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో తండ్రి, కూతురు మృతిచెందారు. ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా చిన్నపూర్ బలరామ్ వీధిలో జరిగింది. బ్యాటరీ వాహనానికి ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు తురై వర్మ. కానీ అర్ధరాత్రి ఒంటిగంటకు ఒక్కసారిగా బ్యాటరీ వాహనం పేలడం (Electric Vehicle Battery On Fire)తో తండ్రి తురై వర్మ, మోహన్ ప్రీతిలు అక్కడిక్కడే మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వేలూరు జిల్లాలోని చిన్నపూర్ బలరామ్ వీధిలో తురైవర్మ, తన కూతురు మోహన్ ప్రీతితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ల్లాపురం రోడ్డులో తురైవర్మకు ఓ ఫోటో స్టూడియో ఉంది. ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి కనుక ఎలక్ట్రిక్ బైక్ కొనాలని భావించారు. మూడు రోజుల క్రితం తిరువణ్ణామలై జిల్లా పోలూరులో రూ.95,000తో బ్యాటరీ సహాయంతో నడిచే ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు.
రాత్రి ఛార్జింగ్ పెట్టగా.. నిద్రలోనే విషాదం..
శుక్రవారం రాత్రి ఎలక్ట్రిక్ బైక్ చార్జింగ్ పెట్టి పడుకున్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్ అర్ధరాత్రి ఒక్కసారిగా పేలిపోయింది (Electric Bike Sets On Fire). ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ పూర్తిగా కాలిపోయింది. దీని పక్కనే పార్క్ చేసిన మరో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇంట్లో దట్టమైన పొగ అలుముకుంది. ఇంట్లో నిద్రిస్తున్న దురైవర్మ, అతని కూతురు మోహన ప్రీతి(13)లు అగ్ని కీలలకు ఆహుతయ్యారు. వీరు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగున వచ్చినా దట్టమైన పొగ, మంటలు అధికం కావడంతో తండ్రీకూతుర్ని రక్షించలేకపోయామని స్థానికులు చెబుతున్నారు.
రెస్క్యూ టీమ్ వచ్చేలోపే నష్టం..
దురై వర్మ, మోహన ప్రీతి అరుపులు విని బయటకు వచ్చిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేలోగా జరగరాని నష్టం జరిగిపోయింది. ఎలక్ట్రిక్ బైక్‌కు మంటలు రావడం, ఇళ్లు దగ్దం కావడంతో ఆ మంటల్లో చిక్కుకున్న తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం వేలూరు ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read: Bhadradri Kothagudem: విషాదంగా మారిన జంతువుల వేట - ఒకరు కరెంట్ షాక్‌తో ! భయంతో మరో వ్యక్తి మృతి
Also Read: Chittoor Crime : వయసులో చిన్న వాడితో అక్రమ సంబంధం, మహిళ ప్రాణం మీదకు తెచ్చింది?