Tamil Nadu Crime : తమిళనాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్య, నలుగురు బిడ్డలను గొడ్డలితో నరికి చంపాడో కిరాతకుడు. తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన ఘటన జరిగింది. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న భర్తను నిలదీయడంతో మృగంలా మారిపోయిన భర్త ఇంట్లో ఉన్న గొడలితో నలుగురు పిల్లలను, భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపుతుంది. 


అసలేం జరిగింది? 


తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా ఓరంతవాడి గ్రామంలో పళనిస్వామి, వల్లీ అనే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ సంతానం ఉన్నారు. అయితే కూలీ పనులు చేసుకుంటూ పళనీస్వామి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసగా మారిన పళనీస్వామి కుటుంబాన్ని పట్టించుకోకుండా భాధ్యతారహితంగా వ్యవహరించేవాడు. ఈ క్రమంలో తరచూ పళనీస్వామికి, అతని భార్య వల్లీకి గొడవలు జరిగేవి. అయితే సోమవారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన పళనీస్వామితో వల్లీ గొడవకు దిగింది. దంపతులు ఇరువురు గొడపడ్డారు. ఆ సమయంలో ఇంట్లో చిన్నారులు నిద్రిస్తున్నారు. భార్యాభర్తల గొడప పెద్దదై  పళనీస్వామి ఇంట్లో ఉన్న గొడలితో నిద్రపోతున్న నలుగురు చిన్నారులను, భార్య వల్లీని హత మార్చాడు. తర్వాత పళనీస్వామి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఈ ఘటనను గమనించి స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే  సంఘటన స్థలంలో ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న చిన్నారిని గుర్తించిన పోలిసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్ధితి విషమంగా ఉండడంతో తిరువణ్ణామలై వైద్య కళాశాలలో చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


హైదరాబాద్ లో దారుణం 


 హైదరాబాద్‌లోని మియాపూర్ లో దారుణం జరిగింది. ప్రియురాలి ఇంటికి వచ్చి మరీ ఆమెపై, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఆపై అదే కత్తితో తన గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచరం ఇవ్వగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన 19 ఏళ్ల వైభవి, సందీప్ గత మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వైభవి.. సందీప్ ను దూరం పెడుతోంది. కానీ సందీప్ మాత్రం ఆమెను వదలడం లేదు. తరచుగా వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్లు చేస్తూ వేధిస్తున్నాడు. నిన్ను చంపి నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. మెసేజ్‌లు పంపుతున్నాడు. ఆమె వాటిని అంతగా పట్టించుకోలేదు. 


ఏ నెంబర్ నుంచి ఫోన్, మెసేజ్ చేసినా బ్లాక్ చేయడం ప్రారభించింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన సందీప్... ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మియపూర్ లోని వైభవి ఇంటికి వచ్చాడు. వైభవి తల్లి శోభతో గొడవపడి ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. తర్వాత తను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు శోభ, వైభవిలను కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సందీప్ కు లోతైన గాయం కావడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరు ముగ్గురూ చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.