Nursing Student Commits suicide: రాత్రి ఎంతో సంతోషంగా కనిపించిన యువతి తెల్లవారేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి హాజరైన విద్యార్థిని అంతలోనే సూసైడ్ చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగింది. ఏ క్షణాన ఏం జరుగుతుంతో చెప్పలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి.


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రేగిడి మండలం చిన్నశిర్లాం గ్రామానికి చెందిన యువతి మజ్జి పావని శ్రీకాకుళంలో ఉంటోంది. స్థానిక రిమ్స్‌లో జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌గా ట్రైనింగ్ తీసుకుంటోంది. ఆదివారం ఓ ఫ్రెండ్ బర్త్‌డే ఉంటే సెలబ్రేషన్స్‌కు వెళ్లింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన పావని.. మరుసటి రోజు నిద్రలేవలేదు. పావని కనిపించడం లేదని రూము డోర్ తెరిచారు. కానీ అక్కడ సీన్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఉరేసుకుని పావని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. 


పావని తండ్రి అప్పలనాయుడుకు ఆమె స్నేహితులు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పావని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువతిది అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు టూ టౌన్ సీఐ ఈశ్వరప్రసాద్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు. ప్రాథమికంగా తెలుస్తోన్న వివరాల ప్రకారం ప్రేమ వివాదమే కారణమని చెబుతున్నారు. స్థానిక రేగడి మండలానికి చెందిన యువకుడ్ని పావని ప్రేమించిందని, అయితే ప్రియుడితో తగదా రావడంతో మనస్తాపానికి లోనై మెడికో ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


రేగిడి చిన్నశిర్లాంలో విషాదం 
ఏఎన్ఎం ట్రైనింగ్ కోసం తమ కూతురు శ్రీకాకుళం వెళ్లిందని పావని తండ్రి అప్పలనాయుడు తెలిపారు. అయితే అంతలోనే కూతురు చనిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంగమ్మ, అప్పలనాయుడు దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా, పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. రెండో కుమార్తె పావని చదువుకుంది, ట్రైనింగ్ పూర్తయితే నర్సుగా పని చేసుకుంటుందని, కుటుంబానికి ఆసరాగా ఉంటుందనుకుంటే ప్రాణాలతో లేదని తెలిసిందని కన్నీటి పర్యంతమయ్యారు. పావని చనిపోయిందని తెలియడంతో చిన్నశిర్లాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అంది వచ్చిందనుకున్న కుమార్తె మరణాన్ని మంగమ్మ తట్టుకోలేక పోతున్నారు.


Also Read: Mohan Babu D Patta Lands : మంచు కుటుంబం గుప్పిట్లో అసైన్డ్ భూములు ! అసలు నిజమేమిటంటే ?


Also Read: Hyderabad: రియల్టర్లపై గన్ ఫైరింగ్ ఘటనలో మరో వ్యక్తి కూడా మృతి, ఛాతిలో రెండు బుల్లెట్లతో చికిత్స పొందుతూ