Son Murdered Mother In Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో (Kadiri) దారుణం చోటు చేసుకుంది. తల్లి ఫోన్ ఇవ్వలేదని ఓ కుమారుడు తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఫ్రీ పైర్ గేమే ఆడుతున్న సమయంలో మధ్యలో ఫోన్‌లో డేటా అయిపోయిందని తల్లిని మొబైల్ ఇవ్వమని అడిగాడు. అయితే, తల్లి ఫోన్ ఇవ్వలేదు. ఈ క్రమంలో తల్లి నిద్రిస్తోన్న సమయంలో కొడుకు కోపంలో కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పిల్లలకు మనం ఫోన్ ఇచ్చి చెడగొడుతున్నామని.. బయటికి వెళ్లి ఆడుకోవాల్సిన వయసులో ఇంట్లో కూర్చుని ఫోన్ నొక్కుకుంటూ ఫ్రీ ఫైర్, పబ్జి లాంటి గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ల మానసిక పరిస్థితి చాలా దెబ్బతింటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లలకు ఫోన్ నుంచి చాలా దూరంగా పెట్టాలని సూచించారు.


బైక్ కొనివ్వలేదని..


అటు, చిన్నపాటి విషయాలకే కొందరు మనస్తాపంతో ప్రాణాలు తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఓ యువకుడు బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో ఇనుప తాళాలు మింగేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. తనకు బైక్ కావాలని భవానీ ప్రసాద్ అనే యువకుడు ఇంట్లో వాళ్లతో గొడవపడి 4 తాళాలు మింగేశాడు.  ఈ క్రమంలో తీవ్ర కడుపునొప్పి రాగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లాప్రోస్కోపీ విధానంతో ఎలాంటి సర్జరీ లేకుండా కడుపులో ఉన్న 4 తాళాలను చాకచక్యంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వైద్యులు వెలికితీశారు. ప్రస్తుతం యువకుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.


Also Read: Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్