మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ఓ ఇంటి కోడలు అయ్యారు. పండితుల వేద మంత్రాల సాక్షిగా ఆవిడ పెళ్లి చేసుకున్నారు. తన చిరకాల ప్రియుడు అంటోనీతో ఏడు అడుగులు వేశారు. ఆ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా కీర్తి షేర్ చేశారు.


హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి!
Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ హిందువు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తి తండ్రి సురేష్ మలయాళంలో ప్రముఖ నిర్మాత.‌ ఆవిడ తల్లి మేనక సీనియర్ హీరోయిన్. తెలుగులో కూడా ఆవిడ సినిమాలు చేశారు. అయితే... క్రిస్టియన్ అయినటువంటి ఆంటోనితో కీర్తి సురేష్ ప్రేమలో పడ్డారు. సుమారు పదిహేను సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలోని కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే... వాళ్ళిద్దరి పెళ్లి ఏ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది? అని ప్రేక్షకుల మధ్య చర్చ జరిగింది. దానికి ఈ రోజు ఫుల్ స్టాప్ పడింది. 


హిందూ సంప్రదాయం ప్రకారం... కేరళలోని మలయాళీలు ఏ విధంగా అయితే పెళ్లి చేసుకుంటారో? అదే పద్ధతిలో వేద పండితుల ఆశీర్వాదంతో కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. 


Also Readఇయర్ ఎండ్ రివ్యూ 2024: కల్కి, సలార్ to పుష్ప 2, దేవర... పిక్చర్ అభీ బాకీ హై ఆడియన్స్ - అసలు కథ సీక్వెల్‌లో ఉందండోయ్!






విజయ్ సహ ప్రముఖుల హాజరు!
కోలీవుడ్ టాప్ స్టార్ అయినటువంటి దళపతి విజయ్, ఇంకా కొంత మంది చిత్ర సీమకు చెందిన ప్రముఖులు పెళ్లికి హాజరు అయ్యారు. గోవాలో పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని కీర్తి సురేష్ గత నెలలో వెల్లడించారు. పెళ్ళికి ముందు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు.


Also Readఇయర్ ఎండ్ రివ్యూ 2024: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే






పెళ్లి తర్వాత హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు!
పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అనే కండిషన్ ఏది కీర్తి సురేష్ ముందు ఆంటోనీ పెట్టలేదు. వివాహం తర్వాత కూడా ఆవిడ సినిమాలు చేస్తారని సమాచారం అందుతుంది. దర్శక నిర్మాతలకు ఆల్రెడీ కీర్తి సురేష్ తన మనసులో మాట చెప్పేశారట... మంచి కథలు ఉంటే తీసుకురమ్మని! పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి విడుదలయ్యే మొదటి సినిమా 'బేబీ జాన్'. తమిళంలో దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన 'తెరి' చిత్రానికి హిందీ రీమేక్ అది. సమంత తమిళం సినిమాలో పోషించిన పాత్రను హిందీలో కీర్తి సురేష్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.