Shamshabad Accident : శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు ఆపకూడదన్న నిషేధం ఉంది. నిబంధనలు బేఖాతరు చేసి లారీ ఆపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వర్షం పడుతుండడంతో లారీ రోడ్డుపై ఆగి ఉందని గమనించలేకపోయారు. దీంతో వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు చనిపోయారు.
దైవదర్శనానికి వెళ్లి వస్తూ
తిరుపతి నుంచి శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. MH BV 0247 క్రెటా కారులో మహారాష్ట్ర వెహికల్ నెంబర్ రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు తుక్కుగూడ వైపు నుంచి పటాన్ చెరువు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓంకార్ ట్రాన్స్ పోర్ట్ కు చెందిన లారీ రోడ్డుపై ఆగి ఉండడంతో వెనకాల నుంచి వచ్చిన కారు అదుపు తప్పి వేగంగా ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది, పోలీసులు కారులో ఇరుక్కుపోయినా క్షతగాత్రులను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : Nizamabad Bank Robbery : బ్యాంకులో జులాయి సినిమా సీన్ రిపీట్, రూ.3 కోట్ల సొమ్ము చోరీ!
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 12 మందికిపైగా మృతి చెందినట్టు అధికారుల ధ్రువీకరించారు. మృతుల్లో విద్యార్థులూ ఉన్నారు. జంగ్లా గ్రామంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో బస్సు లోయలో పడినట్టు కుల్లు డిప్యుటీ కమిషనర్ అశుతోష్ గర్గ్ వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటనతో ప్రధాని నరేంద్ర మోదీదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి పీఎమ్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. గాయపడ్డ వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కూడా ట్వీట్ ద్వారా మృతుల కుటుంబానికి సంతాపం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్రపతి రామ్‌నాత్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు ట్విటర్‌లో స్పందించారు.
Also Read : PM Modi Black Balloons : ఏపీలో నల్ల బెలూన్లపై రాజకీయ రచ్చ, ఎవరు చేశారో తెలుసంటున్న బీజేపీ