Severe Road Accident In Hyderabad: హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు మండలం రామ్‌నుంతల శివారులోని హైవేపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జువగా మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.


Also Read: Hyderabad News: పారిశుద్ధ్య కార్మికురాలిపై ఫీల్డ్ అసిస్టెంట్ లైంగిక వేధింపులు - చర్యలకు జీహెచ్ఎంసీ సిఫారసు