GHMC Action Against SFA Who Harrassed Woman Worker: హైదరాబాద్ జీహెచ్ఎంసీలో (GHMC) దారుణం వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో గాజులరామారం జీహెచ్ఎంసీ సర్కిల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (SFA) కిషన్.. పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కింద పని చేసే మహిళా కార్మికురాలిని ఫీల్డ్ ఆఫీసర్ లైంగికంగా వేధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఉద్యోగిని బెదిరించి లైంగికంగా వేధిస్తూ.. తన మొబైల్‌లో వీడియోలు, ఫోటోలు తీశాడు. తాను చెప్పినట్లు వినకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని కిషన్ బెదిరించినట్లు బాధితురాలు తెలిపారు. రోజూ పనికి వచ్చిన ఆమెను లైంగికంగా వేధించిన అతను ఈ తతంగమంతా ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి ఉన్నతాధికారులు సహా తోటి కార్మికుల చేతుల్లోకి సైతం వెళ్లాయి. వీటిని చూసిన తోటి కార్మికులు ఎస్ఎఫ్ఏ కిషన్ ను నిలదీయగా.. వారికి కిషన్ డబ్బు ఆశ చూపించిననట్లు తెలుస్తోంది. దాదాపు 14 మంది తలా రూ.10 వేలు ముట్టచెప్పినట్లు సమాచారం. 


సస్పెన్షన్ వేటు!


మరోవైపు, దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు కిషన్ పై చర్యలు చేపట్టారు. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అటు, మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం ఈ ఘటనపై స్పందించారు. మహిళా కార్మికురాలిని వేధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.


Also Read: Hyderabad News : రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం