Guppedanta Manasu Serial Today Episode: ఎంజేల్‌ వచ్చి మనుతో మాట్లాడుతుంది. ఎందుకొచ్చావని మను అడిగితే నీకోసమే వచ్చానని ఎంజేల్‌ చెప్తుంది. 'తిక్కతిక్కగా మాట్లాడకు నన్ను డిస్టర్బ్‌ చేయకు' అని మను చెప్పగానే... 'నేను ఎవరినైనా చూడాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా ఎదుటివారి పర్మిషన్‌తో నాకు అవసరం లేదు' అని చెప్తుంది. 'అయితే చూశావుగా, మాట్లాడావు కదా ఇక వెళ్లు' అంటాడు మను. దీంతో ఎంజేల్‌ 'నీ జీవితంలో ఎవరినైనా ప్రేమించావా? నీకు లవ్‌స్టోరీ ఉందా?' అని అడుగుతుంది. దీంతో మను 'ఒకర్ని ప్రేమించాను కానీ నాది వన్‌సైడ్‌ లవ్వు' అనడంతో ఎంజేల్‌ షాక్‌ అవుతుంది.


మను: నేను ఇంతవరకు ప్రేమించింది మా అమ్మను


ఎంజేల్‌: ఏంటి అంటే నువ్వు ఇప్పటిదాకా చెప్పింది అమ్మాయి గురించి కాదా? మీ అమ్మ గురించా? అంటే నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదా? పర్వాలేదు చెప్పు.


మను: లేదు


ఎంజేల్‌: పోనీ నీకు ఎవరైనా ప్రపోజ్‌ చేశారా? అయినా అదేం ప్రశ్న నీకు పదులు  కాదు వందల్లో ప్రపోజల్స్‌ వచ్చి ఉంటాయి.


అంటూ ఎంజేల్‌ మట్లాడుతూ.. 'నా మీద నీ ఒపినీయన్‌ ఏంటి?' అని అడుగుతుంది. దీంతో మను ఎంజేల్‌ను తిట్టి వెళ్లగొడతాడు. మనుకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఎంజేల్‌. మరోవైపు కాలేజ్‌ చాంబర్‌లో కూర్చున్న వసు, రిషిని గుర్తు చేసుకుని బాధపడుతుంది. మీరు ఎప్పుడొస్తారు సార్‌ మీకోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను అనుకుంటుంది. ఇంతలో మహేంద్ర వస్తాడు. రిషి గురించి ఆలోచిస్తున్నావా? అంటూ ఎప్పటికైనా వస్తాడని భరోసా ఇస్తాడు. ఇంతలో అక్కడకు శైలేంద్ర వస్తాడు. రిషి గురించి తలతిక్కగా మాట్లాడుతుంటే మహేంద్ర తిడతాడు.


శైలేంద్ర: మీరు నన్ను మోసం చేశారు బాబాయ్‌. మీరు మట్టి కొట్టుకుపోతారు. అసలు మీరు చేసిన దానికి రిషి అసలు దొరకడు.


మహేంద్ర: ఒరేయ్‌ దరిద్రుడా నిన్ను చంపైనా సరే రిషిని తీసుకొస్తానురా?


శైలేంద్ర: అసలు ఈ ప్రపంచంలోనే లేనివాడిని ఎలా తీసుకొస్తారు. ఒకవేశ వచ్చినా.. నేను రిషిని


అంటూ శైలేంద్ర అనబోతుంటే మహేంద్ర కోపంగా శైలేంద్ర కాలర్‌ పట్టుకుంటాడు. 'తనేం చేస్తాడు మామయ్యా రిషి సార్‌ కాలి గోరు కూడా టచ్‌ చేయలేడు' అంటుంది వసుధార. 'ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు' అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దాంతో 'మిమ్మల్ని ప్రతిక్షణం ఇలా ఇరిటేట్‌ చేస్తూనే ఉంటాను' అని చెప్పి మను చాంబర్‌లోకి వెళ్తాడు శైలేంద్ర.


శైలేంద్ర: నువ్వు ఎంతసేపు తిప్పినా అది అక్కడే ఉంటుంది.


మను: నీకు ఇచ్చిన ట్విస్ట్‌  సరిపోలేదా? మళ్లీ ఎందుకు వచ్చావు.


శైలేంద్ర: తెలుసుకున్నావో లేదో అని వచ్చాను. క్లారిటీ వచ్చిందా? రిలాక్స్‌గా ఉన్నావు.


మను: ఏ విషయంలో


శైలేంద్ర: అదే నీకు ఉన్నాడో లేడో తండ్రి విషయంలో మా బాబాయ్‌ కు కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. వసుధారకు భర్త ఎక్కడున్నాడో తెలియదు. నీకేమో నీ తండ్రి ఎక్కడున్నాడో తెలియదు.


అంటూ శైలేంద్ర, మనును ఇరిటేట్‌  చేస్తుటే వసుధార వస్తుంది. కోపంగా గట్టిగా శైలేంద్ర అని అరుస్తుంది.


శైలేంద్ర: వచ్చావా? నువ్వు కరెక్టు టైంకు వస్తావు. విన్నావా? అంతా వినేశావా? వినే ఉంటావులే?


వసు: అసలు నీకు కొంచెం కూడా బుద్ది లేదా?


శైలేంద్ర: నాకు బుద్ది లేదు అయితే  నీకేమైనా ప్రాబ్లమా? ఇవన్నీ వదిలేయ్‌ బ్రదర్‌ ముందు నీ అన్వేషణ మొదలు పెట్టు నువ్వు నీ తండ్రి ఎవరో తెలుసుకో.. నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితానికి అర్థమే లేదు.


అంటూ శైలేంద్ర మనును ఇరిటేట్‌ చేస్తుంటే వసు తిడుతుంది. ఇక్కణ్నుంచి వెళ్లిపో అంటూ వార్నింగ్‌  ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: జూన్ 2న కేసీఆర్‌కు తెలంగాణ సర్కార్ సన్మానం - అంగీకరిస్తారా ?