Severe Car Accident in Rajendranagar: రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ (Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హిమాయత్ సాగర్ వద్ద డివైడర్ ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ఔటర్ పై డివైడర్ ను ఢీకొట్టగా నుజ్జు నుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శనివారం వీకెండ్ కావడంతో వీరంతా ఒకే కారులో శంషాబాద్ వైపు వెళ్లి తెల్లవారుజామున తిరిగి గచ్చిబౌలి వస్తున్న సమయంలో డివైడర్ ను ఢీకొట్టారు. మృతులు గౌతమ్, ఆనంద్ గా గుర్తించారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Take Care Jagan Anna- వైఎస్ జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్, టేక్ కేర్ అన్నా అని పోస్ట్