Viral News in Telugu: నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. దాదాపు 35 మంది విద్యార్థులు ఈ పార్టీ చేసుకున్నారు. వీళ్లందరినీ యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడోలాని సూపర్‌టెక్ సూపర్‌నోవా రెసిడెన్స్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. స్థానికులు ఈ సమాచారం అందించారు. అంతే కాదు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ అపార్ట్‌మెంట్‌కి వచ్చిన పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. కంప్లెయింట్ ఇచ్చారని తెలిసి పార్టీలోని యువతీ యువకులు రచ్చ చేశారు. పార్టీ జరుగుతున్న ఫ్లోర్ నుంచి కిందకు లిక్కర్ బాటిల్స్‌ని విసిరేసినట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు.
అపార్ట్‌మెంట్ వాసులకు, పార్టీ చేసుకున్న వాళ్లకి మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ జనం గుమిగూడారు. ఈ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రేవ్ పార్టీకి వచ్చే వాళ్ల నుంచి ఎంట్రీ ఫీ కూడా వసూలు చేశారు. సింగిల్స్‌కి అయితే రూ.500, కపుల్స్‌కి రూ.800 ఛార్జ్ చేశారు. వీళ్లంతా 16-20 ఏళ్ల లోపు వాళ్లే. పైగా వీళ్లని వాట్సాప్ ద్వారా ఇన్వైట్ చేసినట్టు విచారణలో తేలింది. హరియాణాకి చెందిన లిక్కర్ బాటిల్స్ పెద్ద ఎత్తున ఆ ఫ్లాట్‌లో కనిపించాయి. పోలీసులు ఈ బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీ చేసుకోవడమే కాకుండా తమతో అసభ్యంగా ప్రవర్తించారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
Also Read: Wayanad: కన్నీళ్లు పెట్టుకున్న వయనాడ్ బాధితులు, ఓదార్చిన ప్రధాని మోదీ - వీడియో