Rajasthan News: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సృష్టించడం తెలిసిందే. వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అలాంటి ఘటనలే తరచుగా మనం వింటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే రాజస్థాన్ లో కూడా ఇలాంటి ఓ హత్యే వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన సొంత మేనత్తను హత్య చేసి ఆపై కట్టర్ మిషన్ సాయంతో పది ముక్కలుగా నరికేసి దారుణానికి పాల్పడ్డాడు. తర్వాత ఆ భాగాలను అడవిలోని తీసుకెళ్లి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో వివరాలు ఇలా ఉన్నాయి. 


అసలేం జరిగిందంటే..?


రాజస్థాన్ లోని జైపూర్ లో ఈ దిగ్భ్రాంతి కలిగించే ఘటన జరిగింది. విద్యాధర్ నగర్ ప్రాంతంలోని లాల్ పురియా అపార్ట్ మెంట్ సెక్టార్ - 2 లో ఈ నెల 11వ తేదీన అనుజ్ అనే వ్యక్తి 64 ఏళ్ల సరోజ్ శర్మ అనే తన మేనత్తను హత్య చేశాడు. తలపై సుత్తితో కొట్టి దారుణహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తన బాత్ రూమ్ లో మార్బుల్ కట్టర్ మిషన్ ను ఉపయోగించి మృతదేహాన్ని పది ముక్కలుగా చేశాడు. ఆపై వాటిని అడవిలో పలు ప్రాంతాల్లో పాడేశాడు. ఆ తర్వాత తనకు ఏం తెలియదన్నట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అత్త అదృశ్యం అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


ఇంటికి తిరిగి వెళ్లిన అనుజ్.. వంట గదిలో ఉన్న రక్తపు మరకలను చూశాడు. వెంటనే వాటిని కడిగేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మృతురాలు కూతురు పూజ అక్కడకు వచ్చింది. అతడు రక్తపు మరకలు కడిగేయడాన్ని గుర్తించింది. వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపింది. హుటాహుటినా రంగంలోకి దిగిన పోలీసులు అనుజ్ ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మేనత్తను ఎందుకు చంపావని ప్రశ్నించగా  నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు. 


సరోజ భర్త చనిపోయిన తర్వాత ఆమె మేనల్లుడు అనూజ్ ఆమె ఇంటికి వచ్చేశాడు. ఆమెను బాగోగులు చూసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. అయితే మేనల్లుడు అనుజ్ మంచి చెడ్డా అన్నీ సరోజనే చూసుకునేది. ఖర్చులన్నీ కూడా ఆమెనే భరించేది. సరోజకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వాళ్లు విదేశాల్లో ఉంటారు. అనుజ్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత హరే కృష్ణ ఉద్యమంలో చేరాడు. అయితే అనుజ్ తన అత్త తీరుపై ఎప్పుడూ కోపంగా ఉండేవాడిని డీసీపీ నార్త్ ప్యారిస్ దేశ్‌ముఖ్‌ తెలిపారు. డిసెంబర్ 11న అనుజ్ హరే కృష్ణ ఉద్యమంలో భాగంగా దిల్లీకి వెళ్తానని చెప్పాడు. అందుకు మేనత్త నిరాకరించింది. అప్పటికే సరోజ తీరుపై కోపంగా ఉన్న అనుజ్ తనను మరోసారి అడ్డుకోవడంతో ఆవేశంతో ఆమెను హత్య చేశాడని డీసీపీ తెలిపారు. మృతదేహాన్ని పడేయడానికి అనుజ్ సికార్ రోడ్డులోని హార్డ్ వేర్ దుకాణానికి వెళ్లి మార్బుల్ కట్టర్ మిషన్‌ను తీసుకువచ్చాడు. అనంతరం మృతదేహాన్ని 10 ముక్కలుగా కట్ చేశారు. అనంతరం శరీర భాగాలను సూట్ కేసు, బకెట్ లో నింపి దిల్లీ రోడ్డు వైపు ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.