హైదరాబాద్ లో బీజేపీ నేతలు వినూత్న తరహాలో నిరసనకు దిగారు. ఏకంగా మెట్రో రైళ్లలో నిరసన చేశారు. పట్టభద్రుల మాదిరిగా దుస్తులు వేసుకొని రైళ్లలో భిక్షాటన చేశారు. నగరంలోని కూకట్ పల్లి మెట్రో స్టేషన్లో బీజేపీ నేతలు ఈ నిరసన చేశారు. పట్టభద్రుల వేషధారణలో ప్లకార్డులు ప్రదర్శించారు. కూకట్ పల్లి నుంచి అమీర్పేట్ వరకు మెట్రో రైల్లో ప్రయాణిస్తూ భిక్షాటన చేసి నిరసన చేశారు. రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని వాపోయారు. నిరుద్యోగులను ఇలా భిక్షాటన చేసే దుస్థితికి సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జనాలను కోరారు.