Nagababu Launches Book The Real Yogi : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటుడు పవన్ కళ్యాణ్‌పై గణ రచించిన ‘ది రియల్‌ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా జరిగింది. పవన్‌ సోదరుడు జనసేన నేత నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై ‘ది రియల్‌ యోగి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వ్యక్తిత్వంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఎవరూ సాటి లేరన్నారు. పవన్ లాగ తాను ఒకరోజైనా ఉండగలనా అని అనుకునేవాడినని, ఇదే తీరుగా గుణ తన పుస్తకంలో పవన్ గురించి రాశాడన్నారు. చిన్నప్పటి నుంచి పవన్ ఒంటరిగా ఉండటం, సమాజం గురించి ఆలోచించడం తన తమ్ముడి వ్యక్తిత్వమన్నారు.


తన పేరు మీద ఉన్న మొత్తాన్ని, పిల్లల మీద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను తీసేసి జనసేన పార్టీని స్థాపించారని నాగబాబు తెలిపారు. రేపు ఎలా గడుస్తుందన్న ఆలోచన పవన్‌కు ఉండదని, ప్రజా సేవ కోసం నిర్ణయం తీసుకున్నాడని గుర్తుచేశారు. సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరో అయినప్పటికీ ఫైనాన్షియల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ జీరో అని ఉద్వేగానికి లోనయ్యారు. వ్యక్తిత్వ పరంగా, మనిషిగా ఎవరూ అందనంత ఎత్తులో ఉంటాడని పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఈ కార్యక్రమంలో టాలీవుడ్ దర్శకుడు బాబీ, నిర్మాత విశ్వప్రసాద్, రచయిత, నటుడు తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.






పవన్ ఆలోచించే విధానం కాస్త భిన్నంగా ఉంటుందన్నారు. టీడీపీ లేదా బీజేపీలోనైనా చేరితే పవన్ కళ్యాణ్‌కు మంత్రి పదవులు సులువుగా వచ్చేవని అభిప్రాయపడ్డారు నాగబాబు. అయితే, పవన్ పదవుల కోసం కాకుండా తన ఆశయాల కోసం, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ పెట్టారని చెప్పారు. డబ్బులు సంపాదించాలనుకుంటే సినిమాల్లోనే కొనసాగేవాడని, రాజకీయాలవైపు రావాల్సిన అవసరం తన తమ్ముడికి లేదని జనసేనానిపై వ్యాఖ్యలు చేశారు.


తాను రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఏదైనా మేలు చేయగలుగుతాని, ఆలోచించేవాడనన్నారు. మనిషి ఇలా ఉంటాడా, యోగిలా ఆలోచిస్తాడా అని పవన్ కళ్యాణ్ ను చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుందన్నారు. తన ఇంట్లోని వ్యక్తి అయిన కారణంగా పవన్ గురించి చాలా తక్కువగా మాట్లుతున్నానంటూ ద రియల్ యోగి పుసక్తావిష్కరణ కార్యక్రమంలో నాగబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.






పవన్ కళ్యాణ్ కు ఉన్న స్టార్ డమ్‌తో హ్యాపీగా బతకొచ్చు, ఇంత కష్టపడాల్సిన అవసరం ఆయనకు ఏ మాత్రం లేదని టాలీవుడ్ డైరెక్టర్ బాబీ అన్నారు. కానీ ఇవన్నీ పక్కన పక్కనపెట్టి, ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తాపత్రయం ఉన్న వ్యక్తి అన్నారు. మంచి కోసం ఆయనకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.