Malkajgiri DCP Dharavath Janaki about Bike Robbery Gang: హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ఉప్పల్, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ల లిమిట్స్ లో వేర్వేరుగా చోరీలకు పాల్పడుతున్న బైక్ దొంగలనురాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి లక్షల రూపాయల విలువ చేసే బైక్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి ఉప్పల్ పీఎస్ లో వివరాలను వెల్లడించారు. 


ఉప్పల్ పీఎస్ కేసు వివరాలిలా..
ఉప్పల్ విజయపురి కాలనీకి చెందిన గంటపంగి జయరాజు (26) వృత్తిరీత్యా ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తుంటాడు. విలాసవంతమైన బైక్ రైడ్ లకు అలవాటు పడ్డ జయరాజు పెద్ద సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతాలైన ఉప్పల్, రామంతాపూర్, భరత్ నగర్, నాగోల్ మెట్రో స్టేషన్ లలో వాహనాలను చోరీ చేసి పెట్రోల్ అయిపోయేంత వరకూ నడిపి ఎక్కడో చోట వదిలేస్తుంటాడు. 
ఉప్పల్ లో రాజ్యలక్ష్మి థియేటర్ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద రీతిలో ఉన్న జయరాజు ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఉప్పల్ పీఎస్ పరిధిలో ఏడు వాహనాలను దొంగిలించినట్లు దర్యాప్తు లో తేలిందన్నారు. నిందితుడు జయరాజు వద్ద నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ జేసే ఏడు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి తెలిపారు. కాగా, నిందితుడు జయరాజు పై 2017లో సెల్ ఫోన్ చోరీ కేసు, 2019 లో ఉప్పల్ పీఎస్ పరిధిలో పోక్సోచట్టం కింద అరెస్టయి జైలుకు వెళ్లినా కూడా పద్దతి మార్చుకోలేదని డిసిపి అన్నారు. 


మల్కాజిగిరి పీఎస్ పరిధిలో కేసుల వివరాలు..
కుషాయిగూడ పీఎస్ పరిధి హనుమాన్ నగర్ కు చెందిన పంబాల నాగరాజు (30) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగరాజు ఆర్ధిక సమస్యలతో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మల్కాజిగిరి, కుషాయిగూడ, నేరేడుమెట్‌, బోయినపల్లి పీఎస్ ల పరిధిలో చోరీలు చేశాడు.


సీసీటీవీ కెమెరాల సాయంతో కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ తో హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో కూడా వర్కవుట్ చేయడం వల్ల నిందితుడిని పట్టుకున్నామని డీసీపీ తెలిపారు. నిందితుడు నాగరాజు వద్ద నాలుగున్నర లక్షల విలువ జేసే రెండు ఆటోలు, అయిదు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి తెలిపారు. 


ఇది ట్రాఫిక్ చలాన్ తీసిన ప్రాణం 
నల్లగొండ జిల్లా నేరడిగొమ్ము గ్రామానికి అన్నెపాక ఎల్లయ్య  , మల్లమ్మ దంపతులు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ చింతల్‌ బస్తీ లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎల్లయ్య హమాలీగా, మల్లమ్మ చంపాపేటలోని సాయిబాబా గుడిలో పనిచేస్తున్నారు. ఎల్లయ్య హమాలీ పనికి వెళ్లి వస్తున్న సమయంలో  మీర్‌చౌక్‌ ట్రాఫిక్‌ ఎస్సై ఆపారు. పలు చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో  సీజ్ చేశారు. కూలీ పనులు చేసుకుని బతుకుతున్న తాము అప్పు చేసి బైక్‌ కొన్నామని, రూ.10 వేలు చలాన్లు రాస్తే ఎలా చెల్లించగలమని ఎల్లయ్య ఎంత బతిమాలుకున్నా ప్రయోజనం లేకపోంది.