Prakasam District News :  ప్రకాశం జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. శివయ్య పిలుస్తున్నాడంటూ శేఖర్ రెడ్డి అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఆ యువకుడు మూడు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. శివుడు పిలుస్తున్నాడు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ యువకుడు రాసిన సూసైడ్ లేఖ స్థానింకగా కలకలం రేపింది. 


శివుడు ఉండొద్దని చెప్పాడని! 


ప్రకారం జిల్లా పెద్దారవీడు మండలం చాట్లమడ గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి అనే యువకుడు చెన్నైలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సెలవులు ఇవ్వడంతో ఇటీవల ఇంటికి వచ్చాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో శేఖర్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు శేఖర్ రెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. ఈ చెడు సమాజంలో శివుడు ఉండొద్దని చెప్పాడని, మరో జన్మలో ప్రజలకు సేవచేసేలా శివుడు పుట్టిస్తానని చెప్పాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సూసైడ్ నోట్ లో రాశాడు. ఆత్మహత్య చేసుకోవడానికి తనకు ఎలాంటి ఇతర ఇబ్బందులు లేవని లేఖలో తెలిపాడు. గత ఏడాది శేఖర్ రెడ్డి తండ్రి చిన్నపురెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి శేఖర్ రెడ్డి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. యువకుడి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


మద్యం తాగొద్దన్నాడని హత్య


కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నర్సింహులు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వస్తూ.. మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధించేవాడు. సహించలేని తండ్రి కొవ్వు ఈరయ్య పలుమార్లు మందలించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న నర్సింహులు.. ఎలాగైనా తండ్రిని హతమార్చాలకున్నాడు. ఫుల్లుగా తాగొచ్చాడు. మద్యం మత్తులోనే అర్ధరాత్రి పడుకున్న తండ్రి గొంతుపై గొడ్డలితో నరికి అత్యంత కిరాతకంగా చంపాడు. అయితే విషయం గుర్తించిన భార్య రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వృద్ధాప్యంలో తమకు సాకాల్సిన కుమారుడు... తాగుడుకు బానిసై తండ్రిని చంపడాన్ని అస్సలే తట్టుకోలేకపోతుంది. 


గొడ్డలితో గ్రామంలో తిరుగుతూ


అయితే తండ్రిని నరికి చంపిన తర్వాత రక్తపు మరకలతో ఉన్న గొడ్డలిని పట్టుకొని నర్సింహులు గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. అయితే అతడి అరాచకాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు నర్సింహులును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈరయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ హత్య కలకలం రేపింది. నిత్యం తల్లి దండ్రులను వేధిస్తున్న కొడుకును పద్దతి మార్చుకోవాలని సూచించినందుకు కన్నతండ్రిని హత్యం చేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read : Loan App Racket: సరికొత్త పంథాలో లోన్ యాప్ చీటర్స్, అలాంటి ఫోన్ కాల్స్ తో జాగ్రత్త సుమీ!


Also Read : Crime News: బతుకమ్మ ఆడుతున్న భార్యను చంపిన భర్త, అదే కారణమా?