PUB Rape Case Update :  జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల చేతికి  మెడికల్ రిపోర్ట్  చేరింది. నిందితులు ఐదుగురికి  పొటెన్సీ టెస్ట్  ఉస్మానియా వైద్యులు చేశారు. మైనర్లు అయిన వారందరూ లైంగిక సామర్థ్యం కలిగి ఉన్నారని ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. పొటెన్సీ టెస్ట్ రిపోర్ట్ ను ఛార్జ్ షీట్ లో పొంద పర్చునున్నారు పోలీసులు . అత్యాచారం కేసులో నేరం నిరూపించడానికి ఈ పొటెన్సీ టెస్ట్ కీలకమని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు   ఆరు మంది నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ కేసులో ఏ-1 గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ నాంపల్లి కోర్టు లో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.  ఐదుగురు మైనర్లు కూడా జువైనల్ కోర్టు లో బెయిల్ కావాలని పిటిషన్ దాఖలుచేశారు. వీరెవరికీ బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కూడా  కౌంటర్ పిటీషన్ దాఖలు చేశారు. 


తమ్ముడ్ని చంపేసిన అన్న వదినలు - పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి


నిందితులు అందర్నీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం వరకూ వీరిని ప్రశ్నించారు.  మైనర్‌కు ఎమ్మెల్యే కుమార్తె బెంజ్‌ కారు ఇచ్చినట్టు విచారణలో తెలింది.  దీంతో ఆమెపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్​కు కారు ఇచ్చినందుకు వారి కుటుంబసభ్యులపైనా కేసులు పెట్టారు. అలానే ఇన్నోవా కారు డ్రైవ‌ర్‌పై కూడా కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తుంది.


చంపేస్తావా నాన్నా ! పిచ్చి భక్తి మైకంలో మునిగిన ఆ తండ్రికి చిన్నారి అరుపు వినిపించిందా ?


బెంజ్ కారు, ఇన్నోవా పోలీసులకు దొరక్కుండా సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. వక్ఫ్​ బోర్డ్​ చైర్మన్​కు ప్రభుత్వం ఎలాంటి వాహనాన్ని కేటాయించలేదని పోలీసులు తేల్చారు. తన సొంత కారుకే గవర్నమెంట్​ స్టిక్కర్​ వేసుకున్నట్టు నిర్ధారించారు. ఇన్నోవా డ్రైవర్​ స్టేట్‌మెంట్ రికార్డ్​ చేసిన పోలీసులు.. ఘటన జరిగిన రోజు ఎవరెవరూ ప్రయాణించారన్న విషయాలను రాబట్టారు.  


తియ్యని మాటల విలువ రూ. 5 కోట్లు - ఖమ్మంలో కిలాడి లేడీ - పాపం ఎస్‌ఐ కూడా !
 


ఐదు రోజుల పోలీస్​ కస్టడీలో మైనర్​ నిందితుల తీరు. పోలీస్ ​స్టేషన్​లో వాళ్ల ప్రవర్తనను చూసి పోలీసులే విస్మయానికి గురైనట్టు తెలుస్తోంది. విచారణ చేస్తున్నంతసేపూ వాళ్లలో పశ్చాత్తాపమే కనిపించలేదని  పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  వెబ్ సిరీస్‌లు చూసి అమ్మాయిపై ఘాతుకానికి పాల్పడినట్టు మైనర్​ నిందితులు చెప్పారని చెబుతున్నారు. కేసు బయటపడిన తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.