Nellore Crime News :  పిచ్చి భక్తితో నేరాలు చేసే వారు సినిమాల్లోనే కాదు .. మన చుట్టుపక్కలా ఉంటారు. అలాంటి వారిని చూసే సినిమాల్లో క్యారెక్టర్లను పెడుతూంటారు. ఇలాంటి ఓ వ్యక్తి కంటిపాపల్ని చంపుకునే ప్రయత్నం చేశాడు. చివరి క్షణంలో కుటుంబసభ్యులు చూశారు కాబట్టి సరిపోయింది. అప్పటికీ ఓ పాప పరిస్థితి విషమంగా మారింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ క్రైమ్ ఘటన అందర్నీ నోళ్లు నొక్కుకునేలా చేసింది. 


ముగ్గులో కవల పిల్లల్ని కూర్చోబెట్టి క్షుద్ర పూజలు


అది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పల్లి గ్రామం .  ఓ ఇంట్లో క్షుద్రపూజల తరహాలో ముగ్గులు వేసి ఉన్నాయి. ఆ ముగ్గుల్లో ఇద్దరు పసివాళ్లను కూర్చోబెట్టి ఉన్నారు. ఓ వ్యక్తి మంత్రాలు చదువుతున్నాడు. పిచ్చి పట్టిన వాడిలా ఉగుతూ పసుపు, కుంకుమలు చల్లుతున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. కానీ అరుపులు వినిపించడంతో పక్కన వాళ్లు ఏం జరుగుతుందా అని వచ్చి చూశారు. అక్కడి పరిస్థితుల్ని చూసి ఒక్క సారిగా భయపడ్డారు. పిసిపిల్లలను బలిస్తాడేమోనని అతన్ని ఎదిరించి తీసుకెళ్లబోయారు. అయితే ఓ పాపను బలవంతంగా తీసుకురాగలిగారు. మరో పాప కోసం కొంత మందిని పోగేసి తీసుకు వచ్చే సరికి.. ఆ పాప గొంతులో కుంకుమ కుక్కేశాడు. అతి కష్టం మీద ఆ పాపను కూడా లాక్కుని ఆస్పత్రికి తరలించారు. ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 


నోట్లో కుంకుమ కుక్కి హత్య చేసే ప్రయత్నం


ఆ వ్యక్తి పేరు వేణు. ఆ పిల్లలు అతని పిల్లలే. కవల  పిల్లలు. పేర్లు పూర్విక, పునర్విక. వేణుకి శాంతి పూజలు, క్షుద్ర పూజల పిచ్చి. ఇటీవల అది ముదిరిపోయింది.  నిత్యం ఏదో ఒక లోకంలో ఉండే వేణు..  ఇంట్లో శాంతి పూజలు చేశాడు. ఇద్దరు కవల పిల్లలను ముగ్గులో కూర్చోబెట్టి  బలిచ్చే ప్రయత్నం చేశాడు. అన్నెం పున్నెం ఎరుగని పసిపాపలను శాంతి పూజల పేరుతో తండ్రి బలివ్వబోయాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పెద్దారెడ్డి పల్లికి చెందిన వేణుకి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. వారిద్దరూ కవల పిల్లలు. ఆస్పత్రిలో చికిత్సకోసం తరలించిన చిన్నారు పునర్విక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  


చివరి క్షణంలో  రక్షించి ఆస్పత్రికి తరలించిన స్థానికులు


ఏమీ తెలియని ఆ కవల పిల్లలు.. చంపేస్తావా నాన్న అన్నట్లుగా భయం భయంగా చూస్తున్నా..  భక్తి పిచ్చిలో పడిపోయిన ఆ తండ్రికి కనీసం మనసు కనికరించలేదు. చేయి ఎత్తడానికి కూడా మనసొప్పని తండ్రి మనసు పూర్తిగా అంతరించిపోయి.. సైకోలా మారిపోయిన వేణు .. కాస్త ఆలస్యం అయి ఉంటే.. తన పిల్లలను తానే చంపుకునేవాడు.