Jagan To Paris :   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సారి కూడా ఆయన యూరప్ వెళ్తున్నారు. ఇటీవల దావోస్ టూర్‌కు వెళ్లివచ్చారు. మూడు రోజులు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులోనూ.. ఆ తర్వాత వారం రోజులు వ్యక్తిగత పర్యటనలోనూ అక్కడే ఉన్నారు. మరోసారి ప్యారిస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సారి పూర్తిగా వ్యక్తిగత పర్యటన.   పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్‌ స్కూల్‌లో సీఎం జగన్ పెద్దకుమార్తె హర్షా రెడ్డి ఆర్థిక శాస్త్రం చదువుతున్నారు. 


ఏపీ టెన్త్ విద్యార్థులకు మరో శుభవార్త - రెండు సబ్జెక్టుల్లో మార్కులు పెంచుకోవచ్చు


లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత పారిస్ లో మాస్టర్స్ చదువుతున్నారు.  గ్రాడ్యూయేషన్ సెర్మనీ ఉండటంతో  ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి.. ఆ వేడుకల్లో పాల్గొనడానికి పారిస్ వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. హర్షారెడ్డి ప్యారిస్ వెళ్లేటప్పుడు సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె గ్రాడ్యూయేషన్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ చిన్న కుమార్తె కూడా లండన్‌లోనే చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వారం రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో కుటుంబ పర్యటనలో వారిద్దరూ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. 


బెజవాడలో చెత్త డంపింగ్ సమస్య, అజిత్ సింగ్ నగర్ నుంచి యార్డు తరలించారని ప్రతిపక్షాల ఆందోళన


ఇటీవల జగన్ సోదరి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చి మరీ అమెరికా వెళ్లారు. వైఎస్ విజయమ్మ, షర్మిల భర్త అనిల్ కుమార్, మరో కుమార్తె తో కలిసి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు జగన్ కుమార్తె ప్రసిద్ధ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేస్తున్నారు. 


ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, కోనసీమ ఎస్పీపై బదిలీ వేటు!


సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.  ఈ మేరకు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత దావోస్ పర్యటన సందర్భంగా ఆయన లండన్ కూడా నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారన్న ఆరోపణలు ఇతర పార్టీలు చేశాయి.   మరో వైపు శుక్రవారం  పులివెందులలో  సీఎం జగన్ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది.