Train Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తపల్లి శివారులో రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలు దూసుకురావడంతో రైల్వే సిబ్బంది ఒకరు, దినసరి కూలీలు ఇద్దరు మృతి చెందారు. రైల్వే ట్రాక్ కు గ్రీసింగ్ చేస్తున్న సమయంలో పక్క ట్రాక్ పై నుంచి గూడ్స్ రైలు వెళుతుండగా ఆ శబ్దంతో పనిచేస్తున్న ట్రాక్ పై రాజధాని ఎక్స్ ప్రెస్ ను గమనించలేదు సిబ్బంది. దీంతో ఎక్స్ ప్రెస్ రైలు పనిచేస్తున్న సిబ్బందిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రైల్వే సిబ్బంది దుర్గయ్య, దినసరి కూలీలు పెద్దకల్వల, సుల్తానాబాద్ లకు చెందిన శ్రీనివాస్, వేణులుగా అనుమానిస్తున్నారు.
రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీకొని
పెద్దపల్లి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి మండలం చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. దిల్లీ నుంచి బెంగళూరు వెళ్తోన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా స్టేషన్ కొత్తపల్లి శివారులో ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలు ఢీకొని రైల్వే సిబ్బంది ఒకరు, ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు శరీరాలు చెల్లాచెదురయ్యాయి.
బావిలో దూసుకెళ్లిన కారు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సిరిసినగండ్ల, కొండపాక మధ్య జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి, ఆయన ఇద్దరు బావలు కనకయ్య, యాదగిరిలు కొండపాక స్టేజీ వద్దకు వచ్చిన తమ బంధువులను కారులో ఇంటికి తీసుకురావడానికి బయలుదేరారు. అతివేగంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి కారు దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు బావిలో పడి కారులో ఇరుక్కుపోయిన వారిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. వారిద్దరికీ గాయాలయ్యాయని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే కారులో చిక్కుకున్న సూరంపల్లికి చెందిన యాదగిరి (42) మృతిచెందాడని పోలీసులు తెలిపారు. కారు బావిలో పడిన సమయంలో అందులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిని ఇద్దర్ని స్థానికులు కాపాడారని, మరో వ్యక్తి చనిపోయాడని వెల్లడించారు. కారును, మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు భారీ క్రేన్ తో సహాయక చర్యలు చేపట్టారు. పాడుబడిన బావికావడం, చుట్టూ చెట్లపొదలు ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగినట్లు తెలుస్తోంది. కారును, మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించారు.
Also Read : Shocking: బైక్‌పై లిఫ్ట్ అడిగాడు, ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడు - తరువాత ఏం జరిగిందంటే
Also Read: Kurnool Nude Call: వీడియో కాల్‌లో బట్టలిప్పేసిన యువతి, తర్వాత చుక్కలు! ఆ వెంటనే సీబీఐ అని ట్విస్ట్