ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్
ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదు
ఇది ఇంతే అనుకుంటే వందేళ్ళు నేడే జీవించే వీలుందే....
ఇది ఓ సినిమాలో పాట...కానీ ఇదే నిజం అని చాలామంది అంగీకరిస్తారు. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. అవకాశం ఉన్నంతలో ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి...ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. కానీ కొందరు కొంపలు మునిగిపోయినట్టు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. దానివల్ల టెన్షన్ పెరుగుతుంది,సమస్య మరింత జఠిలం అవుతుంది. ఈ ఐదు రాశులవారు ఈ కోవకే చెందుతారని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు...
మేషం
ఈ రాశివారికి బలమైన అభిప్రాయాలుంటాయి. వాటినుంచి అస్సలు బయటకు రారు. దానివల్ల చిన్న సమస్య వచ్చినా వారిలో వారు మధన పడిపోయి..ఏదో జరిగిందనే ఫీలింగ్ లో ఉండిపోతారు. మంచికైనా, చెడుకైనా ఒక్కసారి కట్టుబడి ఉంటే వీళ్లని ఆ దృష్టినుంచి, ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకురావడం చాలా చాలా కష్టం.
Also Read: ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకంటారు, బతుకమ్మలకు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి
వృషభం
వృషభ రాశి వారు తమ జీవితం,వృత్తి -ఉద్యోగాల గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. జీవితంలో డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తారు. సంపాదించేందుకు కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తారు. జీవితంలో ఏ విషయాన్నీ సరదాగా తీసుకోరు..మహా మొండివారు. ఎవరైనా జోక్ చేసినా తట్టుకోలేరు..
కన్య
ఈ రాశికి చెందిన వారు చిన్న విషయాలను చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ పరిస్థితిలో వారికి తెలియకుండానే ఒత్తిడి ఫీలవుతారు. ఎప్పుడు చూసినా బిజీబిజీగా కనిపిస్తారు...ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతి విషయంలోనూ అవసరమైన దానికంటే ఎక్కువ చేస్తారు. ఈరాశివారు గంభీరంగా కనిపిస్తారు.
Also Read: ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, ప్రకృతిని ఆటపాటలతో పూజించే 'బతుకమ్మ' వెనుక ఎన్ని కథలో!
వృశ్చికం
ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు..కానీ ఆ ఆలోచనల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భావోద్వేగాలను బయటపెట్టరు. బయటకు కూల్ గా కనిపిస్తారు కానీ అన్ని విషయాలనూ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎదుటివారిపై జోక్స్ వేస్తారు కానీ వీళ్లపై జోక్స్ ని అస్సలు ఎంజాయ్ చేయలేరు..
మకరం
మకర రాశివారు ఫ్యూచర్ పై చాలా సీరియస్ గా ఉంటారు. ఆర్థిక విషయాల గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తుంటారు. వారు తమను..తమ ప్రియమైన వారిని ఎలా సురక్షితంగా ఉంచాలా అని తాపత్రయపడుతూ ఉంటారు.ఈ రాశివారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి జీవితంలో ముందుకు ఎదగడానికి ఒంటరిగా ఉండటానికి కూడా వెనకాడరు.
మిగిలిన రాశులైన కర్కాటకం, మిథునం, సింహం, ధనుస్సు, కుంభం, సింహం , మీన రాశివారికి ఎప్పుడు తీవ్రంగా ఆలోచించాలో, ఎప్పుడు వదిలేయాలో తెలుసుంటారట.ఈ రాశులవారు కూడా జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటారు కానీ కొన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు.
Note: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు