Parvathipuram News : సాధారణంగా పల్లెలు ప్రశాంతతకు పెట్టింది పేరు. గ్రామస్థులు అంత త్వరగా గొడవలకు దూరంగా ఉంటాయి. ఇదంతా ఒకప్పుడు గత కొన్నేళ్లుగా గ్రామాల్లోనూ పరిస్థితులు మారుతున్నాయి. చిన్న కారణాలకే నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో భారీ మోసాలు వెలుగుచూస్తున్నాయి. చిట్టీల రూపంలో రూపాయి రూపాయి దాచుకుంటున్న వారికి కుచ్చు టోపీ పెడుతూ మోసాలకు పాల్పడ్డుతున్నారు కొందరు. ఇలా మోసానికి పాల్పడిన ఓ మహిళను స్తంభానికి కట్టేశారు గ్రామస్థులు. ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది.
చిట్టీలు కట్టించుకుని మోసం
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన శోభ అనే మహిళ గత కొంత కాలంగా చిట్టీలు కట్టించుకుంటుంది. గ్రామంలోని చాలా మంది శోభ దగ్గర చిట్టీలు వేశారు. ప్రతీ నెల క్రమం తప్పకుండా చిట్టి డబ్బులు జమచేస్తున్నారు. అయితే డబ్బులు జమ అవుతున్నా శోభ గ్రామస్తులెవరికీ తిరిగి చెల్లించడంలేదు. కనీసం వడ్డీ కూడా ఇవ్వలేదు. డబ్బు గురించి అడిగితే ఏవో కారణాలు చెబుతూ తప్పించుకు తిరుగుతుంది. దీంతో గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. శోభపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. అయితే గ్రామస్థుల నుంచి చాలా రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న శోభ ఇటీవల గ్రామస్థుల కంటపడింది. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
Also Read: Srikakulam: రెండేళ్ల కొడుకుకి ఉరేసిన కన్న తల్లి, ఆ తర్వాత తాను కూడా - శ్రీకాకుళంలో దారుణం
కట్టేసి కొట్టారు!
శోభను చూసిన గ్రామస్థులు ఆగ్రహంతో ఆమెను ఓ భవనం స్తంభానికి కట్టేశారు. కోపం పట్టలేక కొందరు ఆమెపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థులకు సర్ధి చెప్పి ఆమెను విడిపించారు. పోలీసుల వివరాల ప్రకారం కొమరాడ మండలం శివిని గ్రామంలో శోభ అనే మహిళ చిట్టీల పేరుతో రూ.కోటీ యాభై లక్షలు వసూలు చేసింది. ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా గ్రామస్థులను ఇబ్బంది పెడుతోంది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు, మహిళలు శోభను స్తంభానికి కట్టేశారు. తమ డబ్బులు చెల్లిస్తేనే విడిచి పెడతామన్నారు. తనకు టైం కావాలని ఆమె అడుగుతున్నా స్థానికులు విడిచిపెట్టలేదు.
Also Read : Vizianagaram: వర్క్ ఫ్రం హోంలో బిజీగా భర్త, పక్క గదిలో భార్య దారుణం - ఏం చేసిందో తెలుసా?
Also Read : Kakinada: బాలికను లోపలికి రమ్మని ట్యాబ్లెట్లు ఇచ్చిన హాస్టల్ వార్డెన్, కరోనాకు మందు అని మాయమాటలు - చివరికి