Cyber ​​​​thugs cheated a businessman of Rs 9 crore : ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలో సైబర్ మోసానికి సంబంధించిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సైబర్ దుండగులు ఓ వ్యాపారిని  స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు ఎర చూపి రూ.9.09 కోట్లు కొల్లగొట్టారు. ఈ సంచలన ఘటన తర్వాత బాధితుడు సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. సైబర్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని వ్యాపారి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1.62 కోట్లను స్తంభింపజేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడా సెక్టార్ 40లో నివాసం   రజత్ బోత్రా అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. షేర్ ట్రేడింగ్ గురించి సమాచారం ఇస్తాననే నెపంతో మే 1న ఒక వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయ్యాడు. అలా చేసిన నెల తర్వాత ఈ మోసం జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు నోయిడా సెక్టార్ 36లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఈ కేసుపై విచారణకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రాథమిక విచారణలో పలు కీలక ఆధారాలు లభించాయి.


ఖాతాలోని రూ.1.62 కోట్లను స్తంభింపజేసిన పోలీసులు 
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్) వివేక్ రంజన్ రాయ్ మాట్లాడుతూ.. ‘మే 1న బాధితుడు రాజేష్ బోత్రాను వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. అక్కడ అతనికి షేర్ ట్రేడింగ్ నుండి లాభాల గురించి సమాచారం అందించారు. తర్వాత అతను చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టాడు. మే 27న రూ.9.09 కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోయానని గ్రహించాడు. ఈ విషయమై బాధితుడు ఫిర్యాదు చేయడంతో వెంటనే విచారణ ప్రారంభించాం. ఇప్పటి వరకు అతడి బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.1.62 కోట్లు సీజ్ చేయడంలో సక్సెస్ అయ్యాం. ఈ కేసులో చెన్నై, అస్సాం, భువనేశ్వర్, హర్యానా, రాజస్థాన్‌తో సహా వివిధ ప్రాంతాలకు డబ్బులు ట్రాన్సఫర్ అయ్యాయి.   ఇందులో పాల్గొన్న సైబర్ నేరగాళ్లను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో ప్రమేయమున్న సైబర్‌ దుండగులను అరెస్టు చేశాం’ అన్నారు.


సైబర్ నేరాలకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్
గత ఏడాది లోక్‌సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా సైబర్ క్రైమ్‌కు సంబంధించిన షాకింగ్ నివేదికను సమర్పించారు.  2022-23లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సైబర్ నేరాలు జరిగాయి. ఈ కాలంలో యూపీలో రెండు లక్షల మంది సైబర్ మోసాల బారిన పడ్డారు.  ఈ కాలంలో యూపీలో సైబర్ దుండగులు రూ.721.1 కోట్లు మేర ప్రజలను మోసం చేశారు. దీని తరువాత, సైబర్ నేరాల అత్యధిక కేసులు మహారాష్ట్ర , గుజరాత్‌లో జరిగాయి. 2022-23లో దేశవ్యాప్తంగా 11.28 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో సగం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో దాదాపు రెండు లక్షల కేసులు నమోదయ్యాయి. రెండవ స్థానంలో మహారాష్ట్రలో 1 లక్ష 30 వేలు, మూడవ స్థానంలో గుజరాత్ లో 1 లక్షా 20 వేలు,   నాలుగో, ఐదో  స్థానంలో రాజస్థాన్, హర్యానాల్లో 80వేల కేసులు నమోదయ్యాయి.