Nellore Crime : ప్రేమ పేరుతో తనని లోబరచుకున్న ఎస్సై మహబూబ్ సుభానిపై లేడీ కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు ఇప్పుడు నెల్లూరులో సంచలనంగా మారింది. మహిళా కానిస్టేబుల్ కే రక్షణ లేకుండా పోయిందని ఆమె దిశ పోలీస్ స్టేషన్లో తన గోడు వెళ్లబోసుకుంది. చివరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్ స్టేషన్లో ఈ లవ్ స్టోరీ మొదలైంది. ఎస్సై మహబూబ్ బాషా తనతో పరిచయం పెంచుకుని మోసం చేశారని, చివరకు పోలీస్ కేసు పెడతాననే సరికి పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. చివరకు గర్భం  దాల్చిన తర్వాత అబార్షన్ కోసం ఒత్తిడి చేశారని, బలవంతంగా తనను లోబర్చుకున్నాడని ఆరోపించింది బాధితురాలు.  తనకు గర్భస్రావం అయ్యేలా చేసిన అత్త, భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. తన భర్త తనతో కాపురం చేస్తే చాలని మీడియాకు తెలిపింది. 


ఎస్ఐపై కేసు నమోదు 


నెల్లూరు జిల్లాలో భార్యను వేధించిన ఘటనలో ఓ ఎస్ఐ పై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు.  వేదాయపాళెం ఎస్ఐగా షేక్‌ మహబూబ్‌ సుభాని విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సంతపేటలో పనిచేసేటప్పుడు కానిస్టేబుల్‌గా ఉన్న యువతిని ప్రేమపెళ్లి  చేసుకున్నాడు. అదనపుకట్నం కోసం భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. గత నెల 9వ తేదీన యువతిపై భర్త, అత్త దాడి చేశారు. ఈ క్రమంలోనే ఎస్ఐ సెలవుపై స్వగ్రామానికి వెళ్లిపోయారు. బాధితురాలు గత నెల 28న దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. దిశ మహిళా పోలీసుస్టేషన్‌ ఎస్ఐ లేఖా ప్రియాంక కేసు విచారణ చేపట్టారు. 


గర్భిణీ కిడ్నాప్


నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మూడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా యువతి  తరపు సమీప బంధువులు... ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. ఎరుగట్ల మండల కేంద్రానికి చెందిన మాసం వంశీకృష్ణ అదే గ్రామానికి చెందిన శ్రీజ గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం గురించి కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే ఎలాగైనా సరే తాము పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇద్దరూ ఎవరికీ తెలియకుండా వెళ్లి ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. అనంతరం రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి మరీ పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అమ్మాయిని.. అబ్బాయితో పాటు అతని ఇంటికి పంపించారు. 


రెండు నెలల వరకు శ్రీజ తల్లిదండ్రులు ఆమెను పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత శ్రీజ దగ్గరి బంధువులు ఆమెను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అబ్బాయి ఇంటికి వెళ్లి పలుమార్లు రెక్కీ నిర్వహించారు. వంశీకృష్ణ ఇంట్లో లేని విషయం తెలుసుకుని మిట్ట మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడ్డారు. కుటుంబ సభ్యులను కొట్టి మరీ బలవంతంగా శ్రీజను లాక్కెళ్లారు. గర్భిణీ అని చెప్పినా పట్టించుకోకుండా ద్విచక్రవాహనంపై ఆమెను తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న వంశీకృష్ణ.. పోలీసుల వద్దకు వెళ్లి తన భార్య శ్రీజను కిడ్నాప్ చేసినట్లు తెలిపాడు. ఎలాగైనా సరే భార్యను తన చెంతకు చేర్చాలని కోరాడు. 


Also Read : Nizamabad News: తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని గర్భిణీని బలవంతంగా లాక్కెళ్లిన కుటుంబ సభ్యులు


Also Read : బుల్లెట్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలు, 2 నెలల్లో 100కు పైగా మాయం - మిస్టరీగా మారిన కేసు