Stock Market Closing 04 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 386 పాయింట్ల లాభంతో 17,274 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1276 పాయింట్ల లాభంతో 58,065 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 35 పైసలు పెరిగి 81.52 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 56,788 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,506 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 57,506 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,099 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1276 పాయింట్ల లాభంతో 58,065 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 16,887 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,147 వద్ద ఓపెనైంది. 17,117 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,287 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 386 పాయింట్ల లాభంతో 17,274 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో క్లోజైంది. ఉదయం 38,700 వద్ద మొదలైంది. 38,596 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,177 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1080 పాయింట్ల లాభంతో 39,110 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 48 కంపెనీలు లాభాల్లో 2 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్ ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, డాక్టర్ రెడ్డీస్‌ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కళకళలాడాయి. మెటల్‌, ప్రైవేట్ బ్యాంకు సూచీలు 3 శాతానికి పైగా ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మీడియా, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 2 శాతాన్ని మించి లాభపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.