తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. తొమ్మిది మందిని బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌ శివారులో జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోతే, విశాఖలో మరో నలుగురు యువకుల ప్రాణాలను ఓ ట్రాలీ బలి తీసుకుంది.  


హైదరాబాద్‌లో శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న వారి కారును ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. వాళ్లు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో ఆ ఫ్యామీల్లో విషాదం అలుముకుంది. 


విశాఖలో వెంకోజీ పాలెం వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యువకులు వెళ్తున్న వాహనాన్ని ట్రాలీ డీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు.


నెల్లూరు జిల్లాలో ఆసుపత్రికి వెళ్తున్న ఇద్దరు చనిపోయారు. ఆటోను ఓల్వో బస్సు ఢీ కొట్టడంతో పలువురు గాయపడగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వాళ్లిద్దరు కిడ్నీ వ్యాధిగ్రస్తులు. డయాలసిస్‌ కోసం ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 


నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు
నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దిగువన శివాలయం ఘాట్‌ వద్ద స్నానాలకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం నల్గొండకు చెందిన నాగరాజు, హర్షిత్ సాగర్ కి చెందిన చంద్రకాంత్ పైలాన్ కాలనీలో ఉపనయనం కార్యక్రమానికి హాజరై శివాలయం ఘాట్ వద్ద ఈత కోసం నదిలో దిగారు. అదే టైంలో అధికారులు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రాజెక్టు నుంచి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహానికి ముగ్గురు యువకులు కొట్టుకు పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో 3 గంటల పాటు గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి స్థానిక హాస్పిటల్ కి తరలించారు. పొలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


నిజామాబాద్ జిల్లాలో ఒకరు
ఆర్మూర్ పట్టణ శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ శివారులో గల రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొని మిర్జాపల్లి వాసి గడ్కొల్ నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నారాయణ 20 రోజుల క్రితమే బెహరాన్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఆర్మూర్‌కు వచ్చి తిరిగి ఇంటికి బైక్ పై వెళుతుండగా అతివేగంతో వెళ్లి డివైడర్ మధ్యలో గల చెట్టును ఢీకొని అక్కడికక్కడే నారాయణ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ ఎస్సై రాము సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు



నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దిగువన శివాలయం ఘాట్‌ వద్ద స్నానాలకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకి చెందిన నాగరాజు, హర్షిత్ సాగర్ కి చెందిన చంద్రకాంత్ లు పైలాన్ కాలనీ లో ఉపనయనం కార్యక్రమానికి హాజరై శివాలయం ఘాట్ వద్ద ఈత కోసం నదిలోకి దిగారు. మరో వైపు అధికారులు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రాజెక్టు నుంచి 20.000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహానికి ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో 3 గంటల పాటు గాలింపు చేపట్టి ముగ్గురి యువకుల మృత దేహాలను బయటకి తీసి స్థానిక కమల నెహ్రూ హాస్పిటల్ కి మృత దేహాలను పొలీసులు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ పి.వెంకటగిరి సందర్శించారు.