Miyapur Attack: హైదారాబాద్ మియాపూర్ లో నిన్న జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి తల్లి మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి శోభ ఈరోజు ఉదయం ప్రాణాలు విడిచింది. అయితే తన ప్రియురాలు తనను దూరం పెడుతుందనే కోపతం.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి నిన్న ఉదయం ప్రియురాలు, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం నిందితుడు సందీప్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


గుంటూరుకు చెందిన 19 ఏళ్ల వైభవి, సందీప్ గత మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వైభవి.. సందీప్ ను దూరం పెడుతోంది. కానీ సందీప్ మాత్రం ఆమెను వదలడం లేదు. తరచుగా వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్లు చేస్తూ వేధిస్తున్నాడు. నిన్ను చంపి నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. మెసేజ్‌లు పంపుతున్నాడు. ఆమె వాటిని అంతగా పట్టించుకోలేదు.


ముగ్గురినీ ఆస్పత్రికి చేర్చిన స్థానికులు..


ఏ నెంబర్ నుంచి ఫోన్, మెసేజ్ చేసినా బ్లాక్ చేయడం ప్రారభించింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన సందీప్... ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మియపూర్ లోని వైభవి ఇంటికి వచ్చాడు. వైభవి తల్లి శోభతో గొడవ పడి ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. తర్వాత తను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు శోభ, వైభవిలను కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సందీప్ కు లోతైన గాయం కావడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అర్ధరాత్రి తల్లి శోభ పరిస్థితి కూడా విషమించడంతో గాంధీకి తరలించారు. ఈ క్రమంలోనే ఈరోజు పరిస్థితి విషమించి ఆమె చనిపోయింది. 



రెండు నెలల క్రితం ఓయూలో ఇలాంటి ఘటనే..!


హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో కూడా ఇలానే ప్రేమ పేరుతో ఓ యువతిపై యువకుడు దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ముషిరాబాద్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఆమె డిగ్రీ చదువుతోంది. 


ముషీరాబాద్ బోలక్‌పూర్‌కు చెందిన ఓ యువతి, రంజిత్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ సమీపంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఓ విషయంపై గొడప జరిగింది. ఈ గొడవతో రంజిత్ ఆగ్రహానికి గురై తనతో తెచ్చుకున్న ఆయుధంతో యువతిపై దాడి చేశాడు. ఆమె చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం రంజిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమీప హాస్టల్లో ఉన్న విద్యార్థులు విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన యువతిని కాచిగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.