Minister Lokesh Responded To A Netizen Tweet On The Incident Of Child Begging In Kurnool: కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే సమాజంలో మానవత్వం ఉందా.? అనే అనుమానం కలుగుతుంది. అలాంటి ఘటనే కర్నూలు (Kurnool) నగరంలో తాజాగా చోటు చేసుకుంది. నిండా పదేళ్లు కూడా నిండని బాబుకు రంగు పూసి ఎర్రటి ఎండలో కూర్చోబెట్టి భిక్షాటన చేయిస్తోన్న ఉదంతం ఆందోళన కలిగించింది. బాలుడిని తీవ్రంగా కొట్టి.. ఒంటిపై రంగు పూసి రహదారిపై ఓ ముఠా భిక్షాటన చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎండకు తాళలేక బాలుడు అల్లాడిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ఈ తతంగాన్ని అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. చిన్నారులతో ఇలాంటి పనులు చేయిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


స్పందించిన మంత్రి లోకేశ్




ఓ నెటిజన్ ఈ వీడియోను మంత్రి నారా లోకేశ్‌కు (Nara Lokesh) ట్వీట్ చేసి బాలుడిని రక్షించాలంటూ కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. బాలుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటూ వారిని ఆదేశించారు. 'ఇది హృదయ విదారక ఘటన. ప్రతి బిడ్డ.. భద్రత, ప్రేమ, గౌరవానికి అర్హుడు. మేము ఈ చిన్నారిని గుర్తించి, అతనికి అవసరమైన రక్షణ, సంరక్షణ అందేలా చూస్తాము. అతనిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతాం.' అని తెలిపారు.


Also Read: Konaseema News: అమ్మాయికి మెస్సెజ్ చేశాడని చితకబాదేసి దారుణం, కోనసీమలో ఇంత కోపమా?