YSRCP jagan: ఏపీలో జరుగుతన్న సోషల్ మీడియా తప్పుడు ప్రచారాల రాజకీయంలోకి అనూహ్యంగా నందమూరి బాలకృష్ణను జగన్ తీసుకు వచ్చారు. అప్పుల అంశంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తన తల్లి, చెల్లిపేరుతో రాజకీయం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన వారిలో నందమూరి బాలకృష్ణ ఉన్నారన్నారు. ఆయన తన చెల్లి షర్మిలపై తప్పుడు పోస్టులు పెట్టించారని షర్మిల గతంలో మాట్లాడిన ఓ వీడియోని మీడియా సమావేశంలో ప్లే చేశారు. అందులో ఎన్‌బీకే బిల్డింగ్స్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని షర్మిల చెప్పారు.
2019 ఎన్నికలకు ముందు షర్మిలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్
2019 ఎన్నికలకు ముందు షర్మిలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగాయి. ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేశారు. అప్పుడు ఎన్‌బీకే బిల్డింగ్స్‌లో ఉన్న కార్యాలయం నుంచి ఈ పోస్టింగ్‌లు పెట్టారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆ బిల్డింగ్ నుంచి పోస్టులు పెట్టారు కాబట్టి షర్మిలపై బాలకృష్ణనే పోస్టులు పెట్టించారని జగన్ చెప్పారు. ఈ ప్రెస్ మీట్‌లో చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని వెనకేసుకు వచ్చారు. అతని పేరుతో ఫేక్ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి ఐ టీడీపీ వాళ్లే పోస్టులు పెట్టారన్నారు.
Also Read: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
చంద్రబాబు తన తల్లిదండ్రులు కాలం చేస్తే తలకొరివి కూడా పెట్టలేదన్న జగన్
తల్లి చెల్లి పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని.. తన కుటుంబంలో విబేధాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. చంద్రబాబు తన తల్లిదండ్రులను ఎప్పుడూ జనానికి చూపించలేదని ఆరోపించారు. రాజకీయంగా ఎదిగిన తర్వాత తన తల్లిదండ్రులను ఇంటికి పిలిచి చంద్రబాబు రెండు పూటలా భోజనం కూడా పెట్టలేదని జగన్ చెప్పారు. కాలం చేస్తే తలకొరివి కూడా పెట్టలేదన్నారు. అలాంటి వ్యక్తి తన కుటుంబంపై రాజకీయాలు చేస్తున్నారని.. ఇలాంటి వ్యక్తితో తాను యుద్ధం చేస్తున్నానని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చంద్రబాబు రాజకీయం కోసం ఏమైనా చేస్తారని ఆరోపణ
వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు ముందు ఉంటారని.. నాడు లక్ష్మి పార్వతి నుంచి నేడు తన వరకూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దుర్మర్గమైన వ్యక్తి అని రాజకీయం కోసం ఏమైనా చేస్తారని అన్నారు.