Bagheera OTT Telugu Release Date: థియేటర్లలో 700 కోట్లు కలెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తర్వాత, ఆ మూవీ డైరెక్టర్ కథ అందించిన సినిమా అంటే ఎలా ఉండాలి? బీభత్సమైన హైప్ ఉండాలి. కానీ, ఈ 'బఘీర'కు ఎందుకో హైప్ రాలేదు. థియేటర్లలో కలెక్షన్లు కూడా రాలేదు. దాంతో త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తుంది.


ఓటీటీలో నవంబర్ 21వ తేదీ నుంచి 'బఘీర' స్ట్రీమింగ్
కన్నడ కథానాయకుడు, రోరింగ్ స్టార్ శ్రీ మురళి (Sri Murali) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'. దీనికి 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ అందించారు. ఆయన దర్శకుడిగా పరిచయం అయిన 'ఉగ్రమ్'లో శ్రీ మురళి హీరో. దాంతో పాటు బావ కూడా. అందుకే కథ రాశారు.


'సలార్' విజయం తర్వాత స్క్రీన్ మీద ప్రశాంత్ నీల్ పేరు పడటంతో 'బఘీర' మీద కొంత మంది కన్ను పడింది. కానీ, ట్రైలర్లు చూసి ప్రశాంత్ నీల్ స్టైల్ కనిపిస్తుందని ఆడియన్స్ పెదవి విరిచారు. రిలీజ్ తర్వాత ఈ సినిమాకు థియేటర్లలో రెస్పాన్స్ రాలేదు. ఫ్లాప్ అని తేల్చారు క్రిటిక్స్ అండ్ ట్రేడ్ పర్సన్స్. 


Bagheera OTT Streaming: థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు... ఇంకా చెప్పాలంటే సరిగ్గా 20 రోజులకు 'బఘీర' సినిమా ఓటీటీ రిలీజుకు రెడీ అవుతోంది. నవంబర్ 21... అంటే ఈ గురువారం నుంచి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పేర్కొంది.


Also Readక్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే






'బఘీర' సినిమాలో శ్రీ మురళి టఫ్ పోలీసు ఆఫీసర్ రోల్ చేశారు. మహిళలకు హాని కలిగించే వారిని కఠినంగా శిక్షించే అధికారి ఆయన. మరో వైపు రుక్మిణి వసంత్ ఏమో సున్నితమైన డాక్టర్ రోల్ చేశారు. రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలు కల వాళ్లిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు? ఆ ప్రేమ కథను పక్కన పెడితే... శ్రీ మురళి ఏం చేశారు? విలన్ ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Bagheera OTT Platform: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'బఘీర' చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహించారు. 'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి పాన్ ఇండియా హిట్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ పతాకం మీద విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశారు. శ్రీ మురళి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: డాక్టర్ సూరి, ఛాయాగ్రహణం: ఏజే శెట్టి, సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్.


Also Read: రామ్ పోతినేని కొత్త సినిమాలో యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్... అందాల భామను గుర్తు పట్టారా?