Medchal Malkajigiri District: చనిపోయిన తల్లి శవం పక్కనే కొడుకు మూడు రోజులుగా ఉండడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో చోటు చేసుకుంది. కుమారుడి వయసు 22 ఏళ్లు ఉన్నప్పటికీ అతను ఇలా ప్రవర్తించడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. అయితే, ఇరుగు పొరుగు వారు మాత్రం ఆమెను తన కుమారుడే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.


మేడ్చల్ మల్కాజ్ గిరి (Medchal Malkajigiri) జిల్లాకు చెందిన ఓ మహిళ చనిపోగా అతని కొడుకు 22 ఏళ్ల సాయి క్రిష్ణ గత మూడు రోజులుగా ఆమె పక్కనే ఉన్నాడు. శవాన్ని ఇంట్లో ఉంచుకొనే జీవనం సాగించాడు. దుర్వాసన వచ్చి స్థానికులు ఈ ఘటన చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, ఆ మహిళను తన కుమారుడే చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో తల్లి, కొడుకు మధ్య తరచుగా అనేక గొడవలు జరిగాయని గుర్తుచేశారు. దీంతో పోలీసులు కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తమిళనాడులోనూ..
తమిళనాడులోనూ (Tamilnadu News) ఇలాంటి ఘటనే గతంలో చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు చనిపోవడంతో ఆమె శవం దగ్గర కూర్చుని ఆమె ఇద్దరు కుమార్తెలు ప్రార్థనలు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో (Trichy District) శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని మణపారై (Manaparai) సమీపంలో ఉన్న చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన మేరీ అనే 75 ఏళ్ల వృద్ధురాలు చనిపోయింది. ఆమె భర్త 20 ఏళ్ల క్రితమే చనిపోయాడు. వీరికి ఇద్దరు కూతుర్లు జయంతి (43), జెసిందా (40) ఉండగా.. ఇద్దరికీ ఇంకా వివాహం కాలేదు. 


ఆ ఇంటి నుంచి 2 రోజులుగా ప్రార్థనలు చేసినట్లుగా పెద్దగా శబ్దాలు వినిపించాయని స్థానికులు వెల్లడించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా.. తల్లి మరణించలేదని, ఆమెను చంపడానికి చూస్తున్నారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రార్థనలు చేస్తే తల్లి తిరిగి బతుకుతుందని పోలీసులతో చాలా సేపు వాదించారు. 4 గంటల తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు కూడా వెళ్లిన కుమార్తెలు డాక్టర్లతో కూడా గొడవకు దిగారు.


Also Read: Mahabubnagar Bride: పెళ్లిలో విషం తాగిన వధువు, సరిగ్గా అప్పగింతలకు ముందు - అసలేం జరిగిందంటే