భారతీయ మహిళలు బొట్టు పెట్టుకోవడం సాధారణమే. హిందూ ధర్మంలో తిలక ధారణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖానికి మధ్య భాగంలో కుంకుమ లేదా తిలకం పెట్టుకోవడం వల్ల నాడులు ఉత్తేజితం అవుతాయని పెద్దలు చెబుతుంటారు. బొట్టు పెట్టుకున్న వ్యక్తులను చూస్తే గౌరవం కలుగుతుంది. సింధూరం వల్ల మహిళలు ఆకర్షనీయంగా కనిపించడమే కాకుండా.. ఎంతో సాంప్రదాయకంగా కనిపిస్తారు. బొట్టు పెట్టుకొనేవారిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువని అంటారు. అలాగే బొట్టు వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని అంటారు. అందుకే, పురుషులు కూడా కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. ఇక పెళ్లయిన మహిళలైతే నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. 


అయితే, సోషల్ మీడియాలో ఓ మహిళ సింధూరం పెట్టుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉందని వెల్లడించింది. అది విని నెటిజనులు ‘‘ఏంటమ్మ.. మళ్లీ చెప్పు’’ అని అంటున్నారు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. సింధూరం వల్ల ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆమె ఇన్‌స్టా్గ్రామ్ రీల్ ద్వారా వెల్లడించింది. సింధూరంలో పాదరసం ఉంటుందని, అది మీ శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సహకరిస్తుందని చెప్పింది. అంతేకాకుండా అది లైంగిక వాంఛను కూడా ప్రేరేపిస్తుందని తెలిపింది. సింధూరం వల్ల లైంగిక కోరికలు పుడతాయని ఆయుర్వేదంలో వెల్లడించినట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. అయితే, పాదరసం వల్లే అలా జరుగుతుందని మాత్రం చెప్పలేదు. 


Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?


ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘Be Bodywise’ అనే పేజ్‌లో మహిళల ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన పోస్టులు పెడుతుంటారు. మహిళల లైంగిక సమస్యలు గురించి ఇందులో నేరుగానే చర్చిస్తారు. మహిళలకు అవగాహన కలిగించే వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. వాటిలో భాగంగా ఈ ‘సింధూరం’ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇటీవల ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియో స్క్రీన్ షాట్‌‌ను పోస్ట్ చేశాడు. అంతే, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. 






సింధూరం వల్ల లైంగిక కోరికలు కలుగుతాయనే విషయాన్ని పక్కన బెడితే.. అందులో పాదరసం(మెర్క్యూరీ) ఉంటుందని చెప్పడంపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిపాటి పాదరసం శరీరాన్ని తాకినా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. గర్భాశయంలో పిల్లల ఎదుగుదలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. నరాలు, జీర్ణాశయం, రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. 


Also Read: మీ చర్మం ఇలా మారుతుందా? జాగ్రత్త, ఈ లక్షణాలు కిడ్నీ సమస్యలకు సంకేతాలు


‘సింధూరం’ గురించి అశాస్త్రీయ ప్రచారం చేయడం ఇదే తొలిసారి కాదు. 2019లో భూపాల్ రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(RIE)లో జరిగిన ఓ సదస్సులో కొందరు సింధూరం బ్లడ్ ప్రెజర్‌ను బ్యాలెన్స్ చేస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కొట్టిపడేశారు. ఇందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని, సరైన ఆధారాలు లేకుండా మేథావులు భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయకూడదని వెల్లడించారు. ‘సింధూరం’తో శృంగార కోరికలు పుడతాయనే ప్రచారం.. నెటిజన్‌లు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.