Kukatapally Crime : హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. కోటి రూపాయల విలువ చేసే సొత్తును రికవరీ చేశారు. 28 లక్షల 90 వేల రూపాయల నగదు, 71 లక్షల 10 వేల రూపాయల విలువ చేసే 137 తులాల బంగారం నగలు, డైమండ్స్ ను పోలీసులు నిందితులను నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చక్రి, ఉపేందర్, సీతలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
అసలేం జరిగింది?
కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో ఉంటున్న వడ్డేపల్లి దామోదర్ రావు అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వాచ్ మెన్ ఉన్న చక్రి, అతని భార్య సీత దొంగతనం చేసినట్లు వడ్డేపల్లి దామోదర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చక్రి, సీత, ఉపేందర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి స్టైల్ లో విచారించగా తామే దొంగతనం చేసినట్లు ఒప్పుకొన్నారు. నిందితులు 30 లక్షలు నగదు, 71 లక్షల 10 వేల రూపాయల విలువ గలా 137 తులాల బంగారం, డైమండ్స్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
నేపాలీ ముఠా పనే
కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో వ్యాపారి దామోదర్ ఇంట్లో చోరీ కేసులో ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.28.90 లక్షల నగదు, రూ.71.10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. చోరీ చేసిన అనంతరం నిందితులు బంగారం, ఇతర ఆభరణాలను హైదరాబాద్ లో దాచిన నిందితులు బెంగళూరు పరారయ్యారు. నిందితులు బంగారం తీసుకునేందుకు నగరానికి రాగా పట్టుకున్నట్లు తెలిపారు. పథకం ప్రకారమే నేపాలీ ముఠా యజమాని ఇంట్లో చోరీకి చేసిందని సీపీ చెప్పారు. ఈ ముఠా ధనవంతుల ఇళ్లలో వాచ్ మెన్, పని మనుషులుగా పనిచేస్తూ ఈ తరహా చోరీలకు పాల్పడుతోందన్నారు. నేపాల్ నుంచి ఈ తరహా ముఠాలు దేశంలోని మెట్రో నగరాల్లోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నాయని సీపీ స్పష్టం చేశారు.
Also Read : Cyber Crime: మీరు లోన్ తీసుకుంటే వాళ్లు ప్రాణం తీసుకెళ్తారు- సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక